e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home హైదరాబాద్‌ ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి

ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి

ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి

బడంగ్‌పేట్‌, ఏప్రిల్‌ 22 : ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి అన్నారు. గురువారం బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఇంద్రారెడ్డి 21వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ కోసం గ్రామగ్రామానా ఉద్యమం నడిపి పేదల గుండెల్లో గూడు కట్టుకున్న గొప్ప ఉద్యమకారుడు ఇంద్రారెడ్డి అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసిన నాయకుడు అన్నారు. ఆయన కలలు గన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులు కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ చైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, సుర్ణగంటి అర్జున్‌, ఏనుగు రాంరెడ్డి, పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు రఘునందన్‌చారి, ఖలీల్‌పాషా, నాయకులు పెద్దబావి ఆనంద్‌రెడ్డి, జంగారెడ్డి, ముత్యాలకృష్ణ పాల్గొన్నారు.


మహేశ్వరం, ఏప్రిల్‌ 22 : ఇంద్రారెడ్డి ఆశయాలను నెరవేరుస్తామని జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూనయాదయ్య అన్నారు. గురువారం కౌకుంట్లలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నినాదంతో గ్రామగ్రామానా తిరిగి తెలంగాణ వాదాన్ని ప్రతి గ్రామానికి చా టిన ఇంద్రారెడ్డి సేవలు నేటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన ధీరశాలి ఇంద్రారెడ్డి అన్నారు. ఆయన అడుగుజాడలో యువత నడువాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు.


తుక్కుగూడ, ఏప్రిల్‌ 22 : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకార్‌ మధుమోహన్‌ అన్నారు. గురువారం ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని తుక్కుగూడలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సప్పిడి లావణ్య రాజు ముదిరాజ్‌, బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌గౌడ్‌, రెడ్డిగళ్ల సుమన్‌, బాదావత్‌ రవినాయక్‌, నాయకులు కొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ముప్పిడి శ్రీధర్‌గౌడ్‌, బ్యాగరి సురేశ్‌, మద్దుల చంద్రశేఖర్‌రెడ్డి, పాశం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement