పాదచారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు

ఉప్పల్ నియోజకవర్గంలో పాదచారుల బాధలు తీరనున్నాయి. ఇంతకాలం రద్దీగా ఉన్న ట్రాఫిక్ మధ్య నుంచి రోడ్డుదాటాలంటే నరకయాతన పడ్డారు. దూసుకువస్తున్న వాహనాలను తప్పించుకొని రోడ్డు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. పిల్లలు, వృద్ధులు రోడ్డు దాటేందుకు పడిన కష్టాలు వర్ణణాతీతం. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కొద్ది రోజుల్లోనే పాదచారుల కష్టాలు తీరనున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గంలోని చక్రీపురం, రామంతాపూర్ హెచ్‌పీఎస్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. మరి కొన్నింటికి ప్రతిపాదనలు చేపట్టారు.
ఉప్పల్, జనవరి 27 : ప్రధాన రహదారుల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రద్దీ ప్రాంతాలను గుర్తించి పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నగరంలో మూడు నెలల్లో 28 ప్రాంతాలలో పాదచారుల కోసం పైవంతెనలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉప్పల్ నియోజకవర్గంలోని చక్రీపురం, రామంతాపూర్ హెచ్‌పీఎస్ ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో రద్దీ ప్రాంతాల్లో పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డును సులువుగా దాటేందుకు వీలు కలుగుతుంది.
లిఫ్ట్ సౌకర్యంతో...
ఉప్పల్- రామంతాపూర్ జాతీయ రహదారిపై ఉప్పల్ క్రికెట్ స్టేడియం, మాడ్రన్ బేకరి ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా ఏఎస్‌రావునగర్ అనుటెక్స్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ఈ పైవంతెనలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. కోటి నుంచి రెండు కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఈ బ్రిడ్జిలను ఆర్ఈ ఇన్ఫ్రా సంస్థ నిర్మాణం చేస్తుంది. మెట్ల మార్గంతో పాటుగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు.
ఆధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
జాతీయ రహదారులు, రద్దీ ప్రాంతాల్లో నిర్మించే ఫుట్ఓవర్ బ్రిడ్జిలు పాదచారులకు ఎంతో మేలు చేస్తాయి. ఆధునిక పద్ధతుల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. లిఫ్ట్ సౌకర్యంతోపాటు, మెట్ల మార్గం ఉంటుంది. ఉప్పల్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి, పనులు చేపడుతున్నారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం. - బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉప్పల్
పాదచారుల సమస్యలు తొలిగిపోతాయి
రద్దీ ప్రాంతాల్లో పాదచారులకు ఇబ్బందులు రాకుండా ఉపయోగపడతాయి. రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్డు దాటలేని పరిస్థితి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా సులువుగా రోడ్డు దాటేందుకు వీలు కలుగుతుంది. జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో పై వంతెనలు ఎక్కువగా ఉపయోగపడతాయి.- కొండల్‌రెడ్డి, ఉప్పల్
తాజావార్తలు
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!
- తెలంగాణ రైతు వెంకట్‌రెడ్డికి ప్రధాని మోదీ ప్రశంసలు
- సిలికాన్ వ్యాలీని వీడుతున్న బడా కంపెనీలు.. ఎందుకంటే..?
- ‘సుందిళ్ల బ్యారేజీలో తనిఖీలు’
- ఆకాశ్-కేతిక ‘రొమాంటిక్’ లుక్ అదిరింది
- ట్రాఫిక్ జరిమానా కోసం మంగళసూత్రం తీసిచ్చిన మహిళ
- ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన రోహిత్, అశ్విన్