జెక్కాలనీ సమస్యలు పరిష్కరిస్తా

అమీర్‌పేట్, : జెక్కాలనీ రెసిడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కాలనీలో నెలకొన్న 16 వేర్వేరు సమస్యలను కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు జి.సూర్యశంకర్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రతినిధులు బుధవారం ఉదయం మంత్రిని మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాలనీలో జరిగే ఆదివారం అంగడి సమస్యను ప్రస్తావించారు. 5 వీధుల్లో రోడ్లు శిథిలమయ్యాయని చెప్పారు. సనత్‌నగర్ అగ్నిమాపక కేంద్రానికి కాలనీ పరిసరాల్లో ఎంపిక చేసిన స్థలాన్ని త్వరితగతిన కేటాయింపులు జరిగేలా చూడాలన్నారు. అదేవిధంగా కాలనీవాసులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కామన్ ప్లేస్, నూతన డ్రైనేజీ వ్యవస్థ, ఫుట్‌పాత్ ఆక్రమణలు, సెల్‌ఫోన్ సిగ్నల్ వంటి అంశాలు మంత్రి దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. కాలనీ సమస్యలపై సమీక్షించేందుకు సంబంధిత అధికారులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని మంత్రి తలసాని ఈ మేరకు హామీ ఇచ్చారని అన్నారు. ఈ సమావేశాన్ని ఫిబ్రవరి 6వ తేదీన కాలనీలోని స్ట్రీట్ నంబర్-3లోని సాయి స్పెక్ట్రా అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డితో పాటు కాలనీ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు చింతిరెడ్డి అనంతరెడ్డి, ఫెడరేషన్ ప్రతినిధులు విశ్వనాథరాజు, డాక్టర్ వై.వి.రాఘవయ్య, సురేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.