ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 04:09:37

స్వచ్ఛతే లక్ష్యం పరిసరాల పరిశుభ్రతే రక్ష

స్వచ్ఛతే లక్ష్యం పరిసరాల పరిశుభ్రతే రక్ష

హిమాయత్‌నగర్‌, జనవరి 27: స్వచ్ఛ సర్కిల్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై బస్తీలు, కాలనీల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాకుండా మరోవైపు పబ్లిక్‌ ప్రాంతాలపై దృష్టి సారించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు, బస్తీలు, కాలనీల్లోని చెత్తను ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి తొలగించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. హిమాయత్‌నగర్‌ డివిజన్‌లోని నారాయణగూడ, కింగ్‌కోఠి, రాంకోఠి, బగ్గీఖాన, హైదర్‌గూడ ప్రాంతాల్లో పేరుకుపోయిన మట్టికుప్పలు, చెత్త చెదారం తొలగించారు. అనంతరం రంగు రంగులతో ముగ్గు లు వేసి అందంగా ముస్తాబు చేశారు. వ్యర్థాలు లేని సర్కిల్‌గా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రతిపౌరుడు భాగస్వాములు కావాలని అధికారులు సూచిస్తున్నారు. రోజువారీ పనులను కొనసాగిస్తూనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి రూ.5 భోజన కేంద్రాలు, కూరగాయల మార్కెట్లు, జీవీపీ పాయింట్‌, బస్టాప్‌లు, పబ్లిక్‌ టాయిలెట్లు, ఖాళీ ప్రదేశాలు, వారాంతపు సంతలు, బస్తీలు, కాలనీలను గుర్తించి వ్యర్థాలను తొలగించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. పారిశుధ్యం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ విభాగం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2021 మార్చి 31 వరకు కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్రీ సిటీస్‌ స్టార్‌ రేటింగ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించే దిశగా సిద్ధమవుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నిర్వహించే సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని అధికారులు కోరుతున్నారు.

సమస్య పరిష్కారానికి కృషి

పారిశుధ్య సమస్య పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజుకు ఒక సమస్యను ఎంచుకొని పరిష్కరిస్తు న్నాం. బస్టాప్‌లు, ఖాళీ ప్రదేశాల్లో ఉన్న చెత్తను తొలగించి ముగ్గులు వేసి ప్రయాణికులతో పాటు స్థానికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం.  - డాక్టర్‌ హేమలత, ఏఎంహెచ్‌వో, అంబర్‌పేట 

VIDEOS

logo