మంగళవారం 09 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 04:09:56

బడి పిల్లలకు భద్రత ఫుల్‌

బడి పిల్లలకు భద్రత ఫుల్‌

  • సర్కారు పాఠశాలలకు  కొవిడ్‌ నివారణ సామగ్రి
  •  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి తరగతి గది శానిటైజేషన్‌  
  • గదిలో 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి  
  • నిరభ్యంతర పత్రం తప్పనిసరి చేసిన అధికారులు

పాఠశాలల ప్రారంభానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మరో నాలుగు రోజుల్లో 9, 10దో తరగతుల విద్యార్థులకు పూర్తి స్థాయితో క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వ యం త్రాంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్ని తరగతి గదుల్లో శానిటైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో పాటు కొవిడ్‌ నివారణ సామగ్రి సైతం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందజేశారు. హిమాయత్‌నగర్‌ జోన్‌ పరిధిలో అంబర్‌పేట, హిమాయత్‌నగర్‌ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు

గోల్నాక, జనవరి 26 :  హిమాయత్‌నగర్‌ జోన్‌ పరిధిలోని అంబర్‌పేట, హిమాయత్‌నగర్‌ మండలాల్లో మొత్తం 13 ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుత విద్యాసంవత్సరం 9, 10దో తరగతి విద్యార్థులు 24వందలకు పైగా విద్యనభ్యసిస్తున్నారు. కొవిడ్‌ కారణంగా ఈ విద్యాసంవత్సరం మొదటి నుంచి పాఠశాలలు మూతపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ  సెప్టెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విద్యార్థులు క్లాసులు వినడం లేదు. దీంతో విద్యార్థులను బడికి రప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి  తరగతులు నిర్వహంచేందుకు సిద్ధమవుతున్నారు.

మే నెలలో పరీక్షలు.. 

మే నెలలో నిర్వహించ నున్న పదో తరగతి పరీక్షలు ఈసారి ఆరు పేపర్లకే పరిమితం చేశారు. దీంతో సిలబస్‌ను సైతం కుదించి తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ముఖ్యమైన ప్రణాళికతో సిలబస్‌ను బోధించేందుకు ఉపాధ్యాయులు  సిద్ధమయ్యారు.

 పాఠశాలకు చేరుకున్న కొవిడ్‌ నివారణ సామగ్రి..

 అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారమే కొవిడ్‌ నివారణ సామగ్రిని అందజేశారు. ఇందులో శానిటైర్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లతో పాటు పీపీఈ కిట్లను అందజేశారు. కాగా ప్రతి విద్యార్థికి రెండు మాస్కులు కూడా ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అవి తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. అంత వరకు మాస్కులను మాత్రం విద్యార్థలే సమకూర్చుకోవాలని అధికారులు తెలిపారు. 

 బెంచీకి ఒక్కరే కూర్చోవాలి..

 విద్యార్థులు కూర్చునేందుకు వీలుగా తరగతి గదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతుల గదులు ఖాళీగా ఉండడంతో ప్రతి పాఠశాలలోనూ సరిపడా స్థలం ఉంది. దీంతో తరగతి గదిలో బెంచీకి ఒక్కరి చొప్పున, ఒక గదిలో 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా రు. దీంతో పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేయడానికి ఆవరణలు శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు.  

తల్లిదండ్రుల ఆమోదం తర్వాతే ..

తల్లిదండ్రుల ఆమోదం తర్వాతే పిల్లలను పాఠశాలలకు అనుమతిస్తారు. పాఠశాలలకు హాజరయ్యే  ప్రతి విద్యార్థి నిరభ్యంతర పత్రం తప్పని సరిగా తీసుకురావాలని అధికారులు తెలిపారు. 

VIDEOS

తాజావార్తలు


logo