ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 28, 2021 , 03:49:52

వీడీసీసీతో సమస్యలుండవ్‌

వీడీసీసీతో సమస్యలుండవ్‌

జూబ్లీహిల్స్‌, జనవరి 27: గతంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు బల్దియా అధికారులు కొత్తరూపు ఇస్తున్నారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ మరమ్మతు  చేపడుతున్నారు. యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 అధికారులు శరవేగంగా పనులు పూర్తి కావడానికి చర్యలు చేపడుతున్నారు. ఇందు లో భాగంగా రహ్మత్‌నగర్‌ డివిజన్‌ శ్రీరాంనగర్‌లోని గంగానగర్‌లో రూ.49 లక్షలతో వీడీసీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయా య్యి. దీంతో ప్రజలు గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలసుకున్న అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యూసుఫ్‌గూడ సర్కిల్‌ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈఈ రాజ్‌ కుమార్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. అంతేగాకుండా చురుగ్గా టేబుల్‌ డ్రైన్‌ పనులు కొనసాగుతున్నాయి. రహమత్‌నగర్‌ పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు టేబుల్‌ డ్రైన్‌ పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో వర్షాలకు బీటీ రోడ్డు కొట్టుకుపోవడంతో సిమెంట్‌ కాంక్రీట్‌తో ఇక్కడ టేబుల్‌ డ్రైన్‌ నిర్మిస్తున్నారు. కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ సీసీ టేబుల్‌ డ్రైన్‌ పనులు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఇబ్బందులు లేకుండా చర్యలు: రాజ్‌ కుమార్‌, ఈఈ

యూసుఫ్‌గూడ సర్కిల్‌ పరిధిలో వాహనదారులతో పాటు       స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సీసీ రోడ్లను వీడీసీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నాం. బీటీ రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తున్నాం. ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని వేగంగా రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

గుంతలమయంగా మారింది

గంగానగర్‌ అంతర్గత రోడ్డు చాలాకాలంగా గుంతల మయంగా మారింది. డ్రైనేజీ లైన్ల తవ్వకాల కారణంగా రాకపోకలకు ఇబ్బందులుండేవి. చాలాకాలంగా ప్రజలు, పాదచారులు అవస్థలు పడ్డారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎట్టకేలకు రోడ్డు వేస్తుండడంతో ఆ ఇబ్బందులు తీరనున్నాయి.- దశరథ్‌రావు, గంగానగర్‌

ముగ్గులేయాలన్నా ఇబ్బంది ఉండేది

గంగానగర్‌లో రోడ్డు వేస్తే సంతోషమే. ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలన్నా కూడా ఇబ్బందులుండేవి. రోడ్డు వేస్తే ఇంటిముందు స్థలం విశాలంగా మారుతది. ఎవరికైనా ఇంటిముందు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవడానికి వీలుంటుంది. అధికారులు ఇక్కడ రోడ్డు వేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది.  - నిర్మల, గంగానగర్‌

VIDEOS

తాజావార్తలు


logo