మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 26, 2021 , 04:44:29

పేదల సంక్షేమం కోసమే..

పేదల సంక్షేమం కోసమే..

బండ్లగూడ/శంషాబాద్‌ రూరల్‌, జనవరి 25 :

 పేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కిస్మత్‌పూర్‌ గ్రామానికి చెందిన ప్రవీణ్‌యాదవ్‌, దర్గా కలీజ్‌ఖాన్‌కు చెందిన నజీరాబేగం ఆర్థ్ధిక సహాయం కోసం స్థానిక టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సురేష్‌గౌడ్‌ సహకారంతో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ సమక్షంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ మాట్లాడుతూ రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఇప్పటికే చాలామందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు. ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ 

నిరుపేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరంలాంటిదని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు.  సోమవారం శంషాబాద్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధి దారులకు  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యమందించాలనే లక్ష్యంతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చి ఎంతో మందికి నాణ్యమైన వైద్యమందిస్తున్నారని తెలిపారు. మదన్‌పల్లి తండాకు  చెందిన  వీ. నరేష్‌ రూ. 52 వేలు బహదూర్‌గూడ గ్రామానికి చెందిన టి. మమత రూ. 40,000 వేలు నానాజాపూర్‌ గ్రామానికి చెందిన ఆర్‌. కృష్ణ రూ. 28 వేల చెక్కులను అందించారు.  

కార్యక్రమంలో శంషాబాద్‌ ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు,పార్టీ నాయకులు నీరటి రాజు ముదిరాజ్‌, మోహన్‌నాయక్‌  తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo