మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 26, 2021 , 04:33:11

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి

బాలానగర్‌, జనవరి 25 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే మెరుగైన అభివృద్ధి జరుగుతుందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఫతేనగర్‌ డివిజన్‌లో రూ. 5.15కోట్ల వ్యయంతో పలు సీసీరోడ్డు, నాలా ఫెన్సింగ్‌ పనులకు ఫతేనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పండాల సతీశ్‌గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ 1కోటి 25 లక్షల నిధులతో మాధవీనగర్‌, గౌతంనగర్‌లలో సీసీరోడ్డు పునరుద్ధరణ పనులు, రూ. 37 లక్షలతో ఆల్విన్‌సొసైటీ, పాండకాలనీలలో సీసీరోడ్డు పునరుద్ధరణ పనులు, శివశంకర్‌నగర్‌లో రూ. 55లక్షలతో సీసీరోడ్డు పునరుద్ధరణ పనులు, ఎల్బీఎస్‌నగర్‌, ఇందిరాగాంధీపురంలో రూ. 52 లక్షలతో సీసీరోడ్డు పునరుద్ధరణ పనులు, పిట్టలబస్తీ, వాల్మీకినగర్‌, తెనుగుబస్తీలలో రూ. 78 లక్షలతో సీసీరోడ్డు పునరుద్ధరణ పనులు, రూ. 46 లక్షల నిధులతో జింకలవాడ, ప్రభాకర్‌రెడ్డినగర్‌, హెచ్‌పీరోడ్డులలో సీసీరోడ్డు పునరుద్ధరణ పనులు, రూ. 59 లక్షల నిధులతో భరత్‌నగర్‌ టు భరత్‌నగర్‌ మార్కెట్‌, జింకలవాడ టు సమతానగర్‌, దీన్‌దయాల్‌నగర్‌ టు ఫతేనగర్‌ ఫిష్‌ మార్కెట్‌ కల్వర్టు వరకు ఫెన్సింగ్‌ ఏర్పాటు పనులు, రూ. 62.50 లక్షలతో భరత్‌నగర్‌ ఎల్‌ఐజీ, అండ్‌ ఎం ఐజీలలో సీసీరోడ్డు పునరుద్ధరణ పనులకు వారు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ సీఎం కేసీఆర్‌ జనరంజక పాలన అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.  కూకట్‌పల్లి నియోజకవర్గంలో రూ. ఐదువేల కోట్ల నిధులు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీ, అండర్‌పాస్‌ బ్రిడ్జిల నిర్మాణాలు జరిగాయన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల నేతృత్వంలో యావత్‌ తెలంగాణ అన్ని రంగాలలో రాణిస్తుందన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఫతేనగర్‌ డివిజన్‌ను అన్నిరంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అనంతరం కార్పొరేటర్‌ పండాల సతీశ్‌గౌడ్‌ అన్నారు. ఫతేనగర్‌ డివిజన్‌లో ఎక్కడైనా..ఏదైనా సమస్య తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.   డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు భిక్షపతి, సీనియర్‌ నాయకులు కుతాడి రాములు, సుధాకర్‌రెడ్డి, కన్నయ్య, సుదర్శన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, ఎండీ నసీర్‌, సతీశ్‌, స్థానికులు అధికసంఖ్యలో హాజరయ్యారు. 

VIDEOS

logo