పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా

మల్కాజిగిరి/నేరేడ్మెట్, జనవరి 25: పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. అవినీతి, అన్యాయం సహించా.. ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటాం.. అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నేరేడ్మెట్ డివిజన్ తాజామాజీ కార్పొరేటర్ కటికనేని శ్రీదేవి, ఆమె భర్త బిల్డర్ జీకే హన్మంతరావు, నేరేడ్మెట్ డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి భూ కబ్జాలు, స్థానికులకు వేధింపులు, ఆడపడుచుల పట్ల ప్రవర్తించిన అమానవీయ సంఘటనలపై ప్రాణమున్నంత వరకు పోరాడుతా.. వీరి బారిన పడి స్థలాలు కోల్పోయిన ప్రజలకు అండగా ఉంటా.. న్యాయపరమైన పోరాటానికి అయ్యే అన్ని ఖర్చులు స్వయంగా నేనే భరిస్తా.. చట్టపరంగా వారికి శిక్షపడేలా చేస్తా.. అని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పైవిధంగా స్పందిస్తూ.. చట్టపరంగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు వారి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటే.. అది ఎమ్మెల్యే చేయించాడనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేనే కబ్జాలు చేశాడంటూ సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తున్నాని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా రాకముందే వీరిపై ఎన్నో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు ఉన్నాయన్నారు. కార్పొరేటర్‌గా శ్రీదేవి వచ్చిన తర్వాత మధుసూదన్‌రెడ్డిని డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించుకుని.. వీరు చేసిన కబ్జాలు అన్ని ఇన్ని కావన్నారు. మధుసూదన్‌రెడ్డి, జీకే హన్మంతరావు శ్రీదేవి కలిసి చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేశారని, వాటిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటే వీడియోలు పెట్టి డ్రామాలు చేస్తున్నారన్నారు.
మీడియా ముందుకు మధుసూదన్‌రెడ్డి బాధితులు
మీడియా సమావేశంలో పలువురు మధుసూదన్‌రెడ్డి, జీకే దంపతుల బాధితులు వచ్చి.. వారి స్థలాల కబ్జాలపై కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యమకారుడి ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడిన మధుసూదన్‌రెడ్డి, జీకే దంపతులకు శిక్షపడే వరకు అండగా ఉంటామని ఉద్యమకారులు బద్దం పరశురాంరెడ్డి, వెంకన్న, గుండ నిరంజన్, యాప్రాల్‌కు చెందిన పలువురు పేర్కొన్నారు.
ముగ్గురిని సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే
నేరేడ్‌మెంట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కటికనేని శ్రీదేవి, ఆమె భర్త బిల్డర్ జీకే హన్మంతరావులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. కార్పొరేటర్‌గా శ్రీదేవి, ఆమె భర్త, డివిజన్ మాజీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి కలిసి పార్టీ ముసుగులో అనేక అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేసినందుకు గాను వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. అదే విధంగా.. నేరేడ్మెట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. ఉద్యమకారుడినంటూ భూ అక్రమాలకు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నాడని పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా
వినాయక్‌నగర్/గౌతంనగర్, జనవరి 25: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే మైనపంల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం ఉదయం వినాయక్‌నగర్‌కు బస్తీకి చెందిన చందుకు సీఎం సహాయ నిధి రూ.60వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, నాగరాజు, కృష్ణ, బాలరాజ్, సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతా
కాలనీ, బస్తీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. సోమవారం మౌలాలి డివిజన్ గణేశ్‌నగర్ అధ్యక్షుడు జయకర్ నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిల్లినర్సింగ్రావు బస్తీలో నెలకొన్న సమస్యలు, పెండింగ్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌలాలి డివిజన్ పరిధిలో అనేక అభివృద్ధి పనుల కోసం దాదాపుగా రూ.8కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని అన్నారు.
చాముండేశ్వరి శక్తి పీఠంలో దుప్పట్లు పంపిణీ
మౌలాలి రాఘవేంద్రనగర్‌లోని చాముండేశ్వరి శక్తి పీఠంలో త్యాగరాజునాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేద మహిళాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేశ్, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ వార్డు సభ్యులు మల్లేశ్‌గౌడ్, మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీఎన్వీ సతీశ్‌కుమార్, దమయంతి, మౌలాలి డివిజన్ అధ్యక్షుడు ఎం.మోహన్‌యాదవ్, ఎం.భాగ్యనందరావు, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇబ్రహీం, షేకీల్ తదితరుల పాల్గొన్నారు.
తాజావార్తలు
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా
- రూ. ౩ లక్షల విలువైన గంజాయి పట్టివేత
- ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో అశ్విన్..పోటీలో ముగ్గురు