ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు

సికింద్రాబాద్ : ఆస్తిపన్ను చెల్లింపుదారుల సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఆస్తిపన్ను ఎక్కువగా వచ్చిందని, తమ స్థలం చిన్నది, ఎక్కువ పన్ను వస్తోంది ఇలాంటి పలు కారణాలతో ఆస్తిపన్ను చెల్లించకుండా కాలయాపన చేస్తున్న చెల్లింపుదారుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. చెల్లింపుదారుల ఇండ్లలోకి వెళ్లి పన్ను చెల్లించాల్సిందిగా కోరుతున్నారు. సమస్యలను సాధ్యమైనంత వరకు ఫిర్యాదులు చేసిన అదే రోజు పరిష్కరిస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించాలని నోటీసులు అందుతుండడంతో కార్యాలయానికి ప్రజలు పరిగెత్తుకు వస్తున్నారు. అధికారులు గంటలోనే సమస్యను పరిష్కరించి ఆస్తిపన్ను చెల్లించడంతో సమస్యలు లేకుండా చేస్తున్నారు. నాగేంద్ర కుమార్ తన సమస్యకు పరిష్కారం దొరకడంతో సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మైలార్‌గడ్డకు చెందిన వ్యక్తి చెల్లించాల్సిన పన్నుకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సిందిగా నోటీసులు వచ్చాయి. అధికారులు చివరిగా రెడ్ నోటీస్ అందజేయడంతో సర్కిల్ కార్యాలయానికి చెల్లింపుదారుడు వచ్చి సమస్యను పరిష్కరించుకున్నారు. నామాలగుండుకు చెందిన మరో చెల్లింపుదారుడు తన నివాస సముదాయానికి వ్యాపార సముదాయంగా జీహెచ్ఎంసీ సిబ్బంది చే సిన చిన్న పొరపాటుతో పన్ను పెద్దమొత్తంలో చెల్లించాలని నోటీసులు అందాయి. కొన్నేండ్లుగా ట్యాక్స్ చెల్లించని కారణంగా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ప్రాపర్టీట్యాక్స్ పరిష్కారం కార్యక్రమంలో నేరుగా డిప్యూటీ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించారు. గతంలో సవరించాలని కోరినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వివరించాడు. అప్పటికప్పుడే అతడి నివాసాన్ని పరిశీలించి ట్యాక్స్‌ను వ్యాపార సముదాయం నుంచి నివాస సముదాయంగా మార్చారు. దీంతో దయాకర్ ఆస్తిపన్నును అప్పటికప్పుడే చెల్లించాడు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 23 కోట్లు ఆస్తిపన్ను వసూలు చేసిన అధికారులు ఈ సం వత్సరంలో రూ. 25 కోట్లు వసూలు చేయా లని లక్ష్యంగా పెట్టు కున్నారు. కాగా ఇప్పటి వరకు 20. 72 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. ఇంకా రెండున్నర నెలలకు పైగా సమయం ఉండడంతో లక్ష్యాన్ని చేరు కో వడానికి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా