శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 24, 2021 , 04:45:24

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

ఎల్బీనగర్‌, జనవరి 23 : మార్నింగ్‌ వాక్‌లో భాగంగా శనివారం ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హయత్‌నగర్‌ డివిజన్‌లోని 18 కాలనీల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన నూతన ట్రంక్‌లైన్‌ నిర్మాణంతో పాటుగా రోడ్లు, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి కాలనీ చివరి వరకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డి, నాయకులు శ్రీధర్‌ గౌడ్‌, అరవింద్‌రెడ్డి, జలమండలి జనరల్‌ మేనేజర్‌ అమర్‌నాథ్‌రెడ్డి, డీజీఎం శ్రీనివాస్‌రెడ్డి, ప్రాజెక్ట్‌ డీజీఎం మోహన్‌రావు, మేనేజర్‌ విజయ్‌కుమార్‌, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo