ముమ్మరంగా ఎఫ్వోబీ పనులు

- వృద్ధులు, దివ్యాంగులకు ఎస్కలేటర్ల నిర్మాణం
- తీరనున్న ట్రాఫిక్ సమస్య
మలక్‌పేట, జనవరి 23 : అనునిత్యం రద్దీగా ఉండే ప్రముఖ వాణిజ్య, వ్యాపార, విద్యా కేంద్రమైన దిల్‌సుఖ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ రూ. 3.95కోట్లతో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణపనులు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. గతంలో ఉన్న పాదచారుల వంతెనను మెట్రో నిర్మాణంతో తొలగించాల్సి రావటం, మెట్రో కారిడార్ పూర్తయినప్పటికీ, మరో వంతెనను ఏర్పాటుచేయకపోవటం, మెట్రో కారిడార్ పొడవునా రోడ్డు మధ్యలో పిల్లర్లను అనుసంధానంచేస్తూ డివైడర్ గోడలు ఎత్తుగా నిర్మించటంతో దిల్‌సుఖ్‌నగర్‌లో పాదచారులు జాతీయ రహదారిని దాటడానికి వీలులేకుండా పోయింది. అక్కడక్కడా యూటర్న్లు ఏర్పాటుచేసినప్పటికీ దూరంగా వెళ్లాల్సి రావటంతో పాదచారులు రోడ్డు మధ్యలో ఏర్పాటుచేసిన డివైడర్ గోడలను దాటుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. మరోవైపు నిత్యం ట్రాఫిక్ సమస్యలు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించిన మలక్‌పేట ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, రోడ్డు దాటేందుకు ఎలాంటి వంతెనలు లేనికారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులను ఆర్ఈ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు.
దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలా ఆసుపత్రివద్ద గతంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి మారుతి మందిరం పక్కన ఉండేది, ఇప్పుడు నిర్మిస్తున్న వంతెనను అదేచోట కాకుండా దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలా ఆసుపత్రివద్ద (గడ్డి అన్నారం క్రాస్‌రోడ్ సమీపంలో) నిర్మిస్తున్నారు. పదిరోజుల క్రితం ప్రారంభమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణపనుల్లో ఫుటింగ్ గుంతలు, పునాదులు తీయించి స్టీల్, కాంక్రీట్ పనులు మొదలుపెట్టెందుకు ఆర్ఈ ఇన్ఫ్రా సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.
తాజావార్తలు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!