గాంధీ దవాఖానకు విరాళం

బన్సీలాల్‌పేట్, జనవరి 23 : గాంధీ మెడికల్ కాలేజీ గ్లోబల్ అలయెన్స్, అలుమ్ని అసోసియేషన్, ఏకం ఫౌండేషన్ ఇండియా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ దవాఖానకు రూ.10 లక్షల విలువైన వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. శనివారం అలుమ్ని అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పిడియాట్రిక్, గైనకాలజీ విభాగాలకు అవసరమైన 10 రేడియంట్ వార్నర్స్, 4 ఫెటల్ మానిటర్స్, 30 ఫెటల్ డాప్లర్లను సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులైన వైద్యులు సాయం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గాంధీ దవాఖాన, వైద్య కళాశాలకు పరికరాలను అం దించడంతోపాటు మెరుగైన ర్యాంకులు సాధించిన వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, స్కాలర్షిప్ కూడా అందిస్తున్నామన్నారు. కార్యక్రమం లో దవాఖాన డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్ట ర్ జి.నర్సింహారావు నేత, ఆర్ఎంవో డాక్టర్ శేషా ద్రి, అలుమ్ని అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ లింగయ్య, ప్రతాప్‌రెడ్డి, లింగమూర్తి, చంద్రశేఖర్, నందకుమార్‌రెడ్డి, శ్రీధర్, బాలరాజు, గాం ధీ గైనకాలజీ వైద్యులు మహాలక్ష్మి, జానకీ, అని త, పీడియాట్రిక్ విభాగం వైద్యులు జార్జ్, మధుసూధన్, ఉమాదేవి, సుచరిత, వైద్య విద్యార్థులు శ్రీకాంత్, లోహిత్, నవీన్ పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ చేయూత..
బన్సీలాల్‌పేట్: ప్రభుత్వ బాలికల పాఠశాలలో తరగతి గదుల ఆధునీకరణకు రోటరీ క్లబ్ చేయూత నిచ్చింది. దాతలు దయానంద్ గౌరీ, మీరా గౌరీ రూ.3లక్షలు వెచ్చించి రొటేరియన్ బాలచందర్ మెమోరియల్ బ్లాక్ పేరుతో గన్‌ఫౌండ్రిలోని మహబూబియా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు గదులకు మరమతులు చేపట్టారు. అసిస్టెంట్ గవర్నర్ కేఆర్ పార్థసారథి, మల్లికార్జున్ దీక్షిత్, చంద్రకాంత్, శిరీశ్, సుధారాణి, హరికిషన్ వాల్మీకి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!