ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 23, 2021 , 04:57:30

అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి

అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి

కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలని, దానికి అనుగుణంగా ప్రభుత్వం సహకరిస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు.   శుక్రవారం బోర్డు పరిధిలోని ఆరోవార్డు ఎంఆర్‌ఆర్‌ కాలనీ, భారతి ఎవెన్యూ, హర్షవర్దన్‌ కాలనీ, స్నేహ కాలనీలలో సుమారు రూ. 18లక్షలతో చేపట్టనున్న   తాగునీటి నూతన పైపులైన్‌ పనులకు కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో అజిత్‌రెడ్డి, బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి,  స్థానిక బోర్డు సభ్యుడు పాండుయాదవ్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బోర్డు పరిధిలో కూడా అమలయ్యే విధంగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదన్నారు.  కార్యక్రమంలో వాటర్‌వర్క్స్‌ ఉన్నతాధికారి రాజ్‌కుమార్‌,  బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌. శ్రీనివాస్‌, నాయకులు విద్యావతి, చెన్నకేశవులు, మల్యాద్రి, సంపత్‌కుమార్‌రెడ్డి, తదితరులు  పాల్గొన్నారు. 


VIDEOS

logo