హైదరాబాద్ : ఫ్లయింగ్ సిఖ్‌గా ఖ్యాతిగడించిన భారత స్ప్రింట్ దిగ్గజం మిల్కాసింగ్ మృతి పట్ల రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం ప్రకటించారు. మిల్కా సింగ్ అథ్లెటిక్స్‌లో మిల్కా ఎన్నో విజయాలు సాధించారు. మిల్కా మృతి క్రీడా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. మిల్కా కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.