శనివారం 06 మార్చి 2021
Hyderabad - Jan 19, 2021 , 23:48:25

స్వయం ప్రగతితో స్ఫూర్తి పథం

స్వయం ప్రగతితో స్ఫూర్తి పథం

చంపాపేట్‌, జనవరి 19 : ఒక వైపు ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం.. మరోవైపు ఎటు చూసినా నిఘా నేత్రాలు.. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వ్యాయామ శాలలు, పిల్లలకు క్రీడా ప్రాంగణాలు. ఇంటర్నల్‌ కేబుల్‌ వ్యవస్థ, ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చంపాపేట్‌ డివిజన్‌ పరిధిలోని సాయిరాంనగర్‌ కాలనీ అభివృద్ధికి నిలయమైంది. కాలనీ అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కొంతైతే కాలనీ అసోసియేషన్‌ పాత్ర రెట్టింపని చెప్పవచ్చు. కాలనీ ఏర్పాటు నుంచి అంతా ఒక్కతాటిపై ఉంటూ తమదైన శైలిలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. కాలనీలో సింహభాగం జనాభా విద్యావంతులై, ఉన్నత స్థానాల్లో ఉండటం ఒకింతగా చెప్పుకోవచ్చు.

అభివృద్ధిలో ముందంజ...

కాలనీ ఏర్పాటు నుంచి అసోసియేషన్‌ సభ్యులు ఒకేతాటిపై ఉంటూ అభివృద్ధి చేసుకుంటున్నారు. మొదటగా గ్రీనరీకి పెద్దపీట వేసిన అసోసియేషన్‌ సభ్యులు డ్రైనేజీ, రోడ్లతో ప్రారంభించి సామాజిక భవనాలు, ఓపెన్‌ జిమ్‌లు, దేవాలయాలు, నిర్మించుకున్నారు. కాలనీలో అధిక మొత్తంలో పార్కులను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం నాలుగు పార్కులుండగా అందులోనే చిన్నారులకు క్రీడా ప్రాంగణాలు, ఆట సామగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. ఇండోర్‌, ఔట్‌ డోర్‌ జిమ్‌ సెంటర్లతో పాటు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా జిమ్‌ సెంటర్లను నిర్మించారు. పురాతన రామాలయాన్ని పునఃనిర్మాణం చేసుకొని నిత్యపూజలతో పాటు అన్ని పండుగలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకుంటున్నారు. పార్కులోనే వినాయక మండపం ఏర్పాటు చేసుకొని వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు రూ.15లక్షలతో ఇంటర్నల్‌ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాలనీలోని ఓపెన్‌ ప్లాట్లను సొసైటీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగిస్తూ శుభ్రం చేసుకుంటున్నారు. 

VIDEOS

logo