మంగళవారం 09 మార్చి 2021
Hyderabad - Jan 19, 2021 , 23:32:27

పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు

పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు

మల్కాజిగిరి, జనవరి 19 : పాఠశాలలు ఫిబ్రవరి ఒకటి నుంచి షురూ కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు పాఠశాలల పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్‌ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

కరోనా నేపథ్యంలో 11 నెలలుగా మూతపడ్డ సర్కారు బడులు తిరిగి ఫిబ్రవరి ఒకటి నుంచి పనిచేయనున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటూ ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కేవలం 9,10వ తరగతులను మాత్రమే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్కూలు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో పలు పాఠశాలల  ఉపాధ్యాయులు, జీహెచ్‌ఎంసీ మల్కాజిగిరి ఉప కమిషనర్‌ దశరథను కలిశారు. ఫిబ్రవరి ఒకటిలోపు యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్‌ పనులు చేపట్టాలని, ఇందుకు తగిన సిబ్బందిని తమకు కేటాయించాలని ఉపాధ్యాయులు కోరారు.

శానిటైజేషన్‌ను పూర్తి చేస్తాం.. 

 మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో 66 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో శానిటైజేషన్‌ కోసం శానిటరీ సిబ్బంది, అధికారులతో చర్చించి ప్రణాళికాబద్ధంగా నిర్ణీత సమయంలోపే అన్ని పాఠశాలల్లో శుభ్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.  - దశరథ్‌, డీసీ 

సిబ్బందికి స్కూళ్లలో డ్యూటీ వేస్తాం.. 

సర్కిల్‌ పరిధిలోని 66 పాఠశాలలకు సంబంధించి ఆయా స్కూళ్ల పరిధిలోని సిబ్బందితో శానిటేషన్‌ పనులు పూర్తి చేస్తాం. సరిపడా సిబ్బంది లేకపోవడంతో రోజువారీ విధులతో పాటు అదనంగా డ్యూటీలు వేసి, పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. - నాగరాజు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ 


VIDEOS

logo