చెత్త సేకరణకుకొత్త ప్రణాళికలు

జూబ్లీహిల్స్, జనవరి 19 : చెత్త సేకరణకు బల్దియా అధికారులు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బిన్లెస్ సర్కిల్‌గా మార్చేక్రమంలో యూసుఫ్‌గూడ-19వ సర్కిల్ పరిధిలో డంపర్ బిన్ల తొలగింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. యూసుఫ్‌గూడ సర్కిల్లో ఉన్న 18 ప్రాంతాల్లో డంపర్బిన్లు పూర్తిగా తొలగించేందుకు జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం శానిటేషన్, ఎన్విరాన్మెంట్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీతో కలిసి చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. గతంలో 100 కుపైగా ఉన్న డంపర్ బిన్లలో 60 నుంచి 70 డంపర్ బిన్లు తొలగించి 42 ఆర్ఎఫ్సీ మినీ బిన్లను ఏర్పాటు చేశారు. కాగా డంపర్బిన్లు పూర్తిగా తొలగిస్తే చెత్త తరలింపునకు కావాల్సిన భారీ వాహనాలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. చెత్త తరలింపు బిన్లను గణనీయంగా తొలగించేందుకు కసరత్తు చేస్తున్నారు. చెత్త తరలింపు కోసం స్వచ్ఛ ఆటోలపై ఆధారపడ్డ అధికారులు డంపర్బిన్లను పూర్తిగా తొలగిస్తే తరలింపునకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలను అన్వేషిస్తున్నారు.
చెత్త సేకరణ ఏజెన్సీలకు...
ఇండ్ల నుంచి వచ్చే చెత్తను స్వచ్ఛ ఆటోలతో అధికారులు తరలిస్తున్నారు. అయితే వ్యాపార, వాణిజ్య రంగాల నుంచి వచ్చే చెత్తను తరలించే పనిని ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి టెండర్ల ప్రక్రియ పూర్తిచేసిన అధికారులు ఆయా సంస్థలతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుంచి రహదారులపై చేరుతున్న చెత్తతో పాటు చెట్ల కొమ్మల చెత్తను తరలించేందుకు 19వ సర్కిల్లో ఒక ఏజెన్సీ బాధ్యతలు చేపట్టనుంది.
భరత్‌నగర్ ఫ్లై ఓవర్ దగ్గర పైలట్ ప్రాజెక్టు
డంపర్ బిన్ల తొలగింపు పను ల్లో భాగంగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా భరత్‌నగర్ ఫ్లై ఓవ ర్ జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర పనులు చేపడతాం. డంపర్ బిన్లు తొలగిస్తే చెత్త తరలింపు పూర్తిగా వాహనాలతో చేపట్టాల్సి ఉంది. దీంతో చెత్త తొలగింపు వాహనాల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. స్వచ్ఛ ఆటోలతో ప్రతిఇంటి నుంచి సేకరిస్తున్న చెత్తను భారీ వాహనాలతో తరలిస్తాం. - డాక్టర్ బిందుభార్గవి, ఏఎంఓహెచ్, యూసుఫ్‌గూడ