తగ్గుతున్న చౌరస్తాలు.. పెరుగుతున్న యూటర్న్లు

- ఇక సులువుగా ప్రయాణం
- ప్రత్యామ్నాయంతోనే సమస్యలకు పరిష్కారం
- వాహనదారులకు తొలగిన ట్రాఫిక్ కష్టాలు
గోల్నాక, జనవరి 19 : నిత్యం రద్దీగా ఉండే అంబర్‌పేట ప్ర ధానరహదారులు ట్రాఫిక్ చక్రబంధంలోంచి బయటకు వస్తున్నాయి. అసలే ఇరకైన రహదారి అందులో అస్తవ్యస్తంగా పా ర్కింగ్ల వల్ల గతంలో తీవ్రమైన సమస్య ఉండేంది. దీంతో ప్రతి రోజూ వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యలకు చెక్ పెట్టారు. చిన్నచిన్న చౌరస్తాల్లో ఓ వైపు రహదారులు మూసివేసి వన్‌వేలు చేయడంతో పాటు యూటర్న్‌లను పెంచడంతో ట్రాఫిక్ సమస్యలకు మోక్షం కలిగించారు. దీంతో దూరం భారమైనా వాహనాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి.
ప్రధానరహదారులపై సజావుగా ప్రయాణం..
అంబర్‌పేట ప్రధానరహదారి పాలిటెక్నిక్ కళాశాల బస్‌స్టాప్ నుంచి కాచిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వరకు గతంలో నిత్యం రద్దీ ట్రాఫిక్ ఉండేది. ఈ ట్రాఫిక్ సమస్యతో వాహనదారులకు నరకం చూసేవారు.. ఉప్పల్, రామంతాపూర్ నుంచి గోల్నాక, కోఠి, తిలక్‌నగర్, నల్లకుంట, శివంరోడ్, ఉస్మానియా యూనివర్సిటీ, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అంబర్‌పేట గాంధీ బొమ్మ వద్దకు రాగానే కంగు తినాల్సిన పరిస్థితి ఉండేది. గాంధీ బొమ్మనుంచి శ్రీరమణ చౌరస్తా మీదుగా ‘ఛే’ నంబర్ చౌరస్తా వరకు సుమారు కిలో మీటరు దూరం ఉన్నప్పటికీ అది దాటాలంటే కనీసం అర్ధగంట నుంచి గంట సమయం పట్టేది. ఇక కోఠి, తిలక్‌నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి రామంతాపూర్, ఉప్పల్ వైపు వెళ్లాలంటే కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ అంబర్‌పేట ఫ్లై ఓవర్ విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన రహదారికి ఇరు వైపులా భవనాలు కూల్చివేసి విస్తరించగా రహదారిపై వాహనాల రాక పోకపోకలు సజావుగా సాగుతున్నాయి. దీంతో పాటు వినాయక్‌నగర్ చౌరస్తా వద్ద ఓ వైపు రహదారి మూసి వేసి పెట్రోలు పంపు వద్ద యూటర్న్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యకు మోక్షం కలిగింది. అంబర్‌పేట ‘చే’ నంబరు చౌరస్తా వద్ద గోల్నాక వైపు నుంచి తిలక్‌నగర్ వైపు వెళ్లే రహదారిని విస్తరించి లెఫ్ట్‌టర్న్ ఏర్పాటు చేయడంతో ఛే నంబరు సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోయాయి. నిత్యం ట్రాఫిక్ జాం ఏర్పడే శివం రోడ్డులోని కెనరా బ్యాంకు చౌరస్తాలో కూడా ఓ వైపు మూసి వేసి కొద్ది దూరంలోనే యూటర్న్ ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా సమస్య తీరింది. అయితే కొద్దిగా దూరభారమైన గమ్యం మాత్రం చేరువైందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమస్య పరిష్కరించాం..
ప్రధానరహదారుల్లో సిగ్నల్స్ లేని చౌరస్తాల్లో నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల రద్దీతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడేది. ఈ సమస్యలను గుర్తించి చిన్నచిన్న చౌరస్తాల్లో ఓ వైపు రహదారి మూసి వేసి కొద్ది దూరంలోనే యూటర్న్ ఏర్పాటు చేయడంతో సమస్యను చాలా వరకు పరిష్కరించాం. అంతేకాకుండా రహదారులపైన వాహనాలు పార్క్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే ప్రాంతాల్లో ఫొటోలు తీసి జరిమానాలు విధించడంతో ఈ సమస్య చాలా వరకు తగ్గింది. - ఎ.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ పీఎస్, కాచిగూడ
తాజావార్తలు
- విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?
- వాలంటీర్లు మున్సిపల్ అధికారులకు సెల్ఫోన్లు అప్పగించాలి
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్