మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 19, 2021 , 23:22:30

పార్కుల అభివృద్ధికి చర్యలు

పార్కుల అభివృద్ధికి చర్యలు

చిక్కడపల్లి, జనవరి 19 : నియోజకవర్గ పరిధిలోని పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ (బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా ఆర్‌.రాజేశ్వర్‌రావు, ప్రధానకార్యదర్శిగా బి.భగత్‌గౌడ్‌, కోశాధికారిగా ఎం.సునీల్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ హాజరై మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆరోగ్యం కోసం ప్రతిరోజు గంటపాటు వాకింగ్‌ చేయాలన్నారు. సుందరయ్య పార్కును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వాకర్స్‌కు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అధ్యక్షుడు రాజేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. వాకర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రవిచారి, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ, వాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధులు వెంకటకృష్ణ రావు, రాజేంద్రప్రసాద్‌ గౌడ్‌, మురళికృష్ణ, నాగభూషణం, కృపానంద్‌, ఎంఎన్‌ రావు, దామోదర్‌రెడ్డి, ఎ.రాజ్‌కుమార్‌, కె.రాము, దేవ్‌రాజ్‌ గౌడ్‌, శంకర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కోటేశ్వరరావు, వివేక్‌, జయదేవ్‌ పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo