బాధిత కుటుంబాలకు భరోసా..

ఉప్పల్/మల్లాపూర్, : నియోజకవర్గం ప్రజల ఆరోగ్య సంరక్షణకు తోడ్పాటు అందిస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నామన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. చిలుకానగర్, మీర్‌పేట హెచ్‌బీకాలనీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డికి రూ.60 వేలు, శిరీష్‌కుమార్‌కు రూ.50 వేలు, యశోదకు రూ.30 వేలు, యాదయ్యకు రూ.38 వేల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌బీకాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, టీఆర్ఎస్పార్టీ చిలుకానగర్ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గరిక సుధాకర్, ముక్కాల రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి..
పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్ బ్యాంక్‌కాలనీకి చెందిన లీలావాణి, అశోక్‌నగర్‌కు చెందిన వి. స్వప్న కొన్ని నెలల కిందట అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం వారు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా.. లీలావాణికి రూ. 26 వేలు, స్వప్నకు రూ.40 వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి కార్పొరేటర్ దేవేందర్‌రెడ్డితో కలిసి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి, గరిక సుధాకర్, నెమలి రవి, రాపోలు సతీశ్, నాగరాజు, వాసు, ప్రవీణ్, దాసరి రవి, పవన్, జె. భాస్కర్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే డైనేజీ సమస్య పరిష్కారం
మల్లాపూర్, జనవరి 17 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణకాలనీలో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి డ్రైనేజీ నాలా సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి డ్రైనేజీ నాలా మరమ్మతుల పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, గరిక సుధాకర్, రాపోలు సతీశ్, నెమలిరవి, శ్రీకాంత్‌రెడ్డి, శేఖర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు
- నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
- దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- వన్‌ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే