శనివారం 06 మార్చి 2021
Hyderabad - Jan 18, 2021 , 04:11:00

సీబీఎస్‌లో సౌకర్యవంతంగా...

సీబీఎస్‌లో  సౌకర్యవంతంగా...

సుల్తాన్‌బజార్‌,  : గౌలిగూడ సీబీఎస్‌ బస్‌స్టేషన్‌ హ్యాంగర్‌  కూలిపోయి ఏండ్లు గడుస్తున్నది. దానిస్థానంలో అధునాతన బస్‌స్టేషన్‌ నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది ఎంతో సౌకర్యవంతంగా ఉండేదని ప్రభుత్వం ఆధునిక బస్‌స్టాండ్‌ నిర్మాణానికి ముందుకు రావాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా సీబీఎస్‌ షెడ్డులో ఏర్పాటు చేసిన దుకాణాలు కోల్పోయినవారికి మరోచోట అవకాశం కల్పించాలని దుకాణాదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  

88  ఏండ్లుగా సేవలు  ..

సీబీఎస్‌ బస్‌స్టేషన్‌ 88 ఏండ్లుగా ప్రయాణికులకు సేవలందించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రయాణికులు మేలైన సేవలందించిన ఘనత సీబీఎస్‌కు దక్కుతుంది. సీబీఎస్‌ కూలిన అనంతరం షెడ్‌ను తొలగించగా ప్రస్తుతం బోసిపోయినట్లు కనిపిస్తుంది. అక్కడే మరో అధునాతన బస్‌స్టేషన్‌ నిర్మాణం నేటికి ప్రారంభం కాలేదు. 

దుకాణదారులకు ఉపాధి  ..

సీబీఎస్‌ హ్యాంగర్‌ కొనసాగుతున్న ప్రాంగణంలో ప్రయాణికుల రాకపోకలతో పా టు సీబీఎస్‌లో ఎన్నో దుకాణాలు కొనసాగుతుండేవి. వారికి అప్పట్లో మంచి ఉపా ధి లభించేది. సీబీఎస్‌ శిథిలావస్తకు చేరుతున్న తరుణంలో చిరువ్యాపార దుకాణాలను తొలగించారు. సీబీఎస్‌ బస్‌స్టేషన్‌ కూలిపోగా ఎన్నో దుకాణాల ద్వారా ఉపా ధిపొందుతున్న వారు వీధిన పడ్డారు.   అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణమయ్యే బస్‌స్టేషన్‌లో తిరిగి వ్యాపారస్తులకు చోటు కల్పిస్తామని హామీలు ఇచ్చారు. కానీ నిర్మాణం పనులు ఏ మాత్రం ముందుకు జరుగలేదు. 

అధునాతన నిర్మాణం జరిగేనా ..

గౌలిగూడలోని సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ సీబీఎస్‌కు ఎంతో ఘనమైన చరి త్ర ఉంది. మూసీ ఒడ్డున మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు సమీపంలో నిజాం కాలంలో అప్పటి సాంకేతి పరిజ్ఞానంతో పూర్తి ఇనుముతో దీనిని నిర్మించారు. దేశంలోని వివిధ ప్రాంతాలో పాటు రెండు తెలుగు రాష్ర్టాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే ప్రయాణికులతో పాటు నగర ప్రజలు సీబీఎస్‌లో అందుబాటులో ఉండే సిటీ బస్సుల ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు.  ఇది  జూలై 5, 2018న ఇక సెలవంటూ పక్కకు ఒరిగింది.  

మోడ్రన్‌ బస్‌స్టాండ్‌ నిర్మాణం ఎప్పుడో ..

ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే బస్‌స్టాండ్‌ షెడ్‌ కూలి ఏండ్లు గడుస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆధునిక బస్‌స్టాండ్‌ నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. సీబీఎస్‌ షెడ్డులో గతంలో ఉపాధి పొందిన దుకాణదారులకు తిరిగి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం వెంటనే నూతన బస్‌స్టాండ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


VIDEOS

logo