సోమవారం 08 మార్చి 2021
Hyderabad - Jan 18, 2021 , 04:03:10

దోమలపై ఎంటమాలజీ యుద్ధం

దోమలపై ఎంటమాలజీ యుద్ధం

బేగంపేట్‌  : అపరిశుభ్రతతో నగర ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఎంటమాలజీ అధికారులు ప్రత్యేక  చర్యలు తీసుకుంటుండడంతో దోమల వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. బేగంపేట సర్కిల్‌ పరిధిలో పరిసరాల పరిశుభ్రతకు, దోమల నివారణకు సంబంధిత అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.  మురుగునీటి ప్రవాహాలు, నాలాలు, నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలు, మురికి వాడలు, బస్తీలల్లో   ఫాగింగ్‌ యంత్రాలు, యాంటి లార్వా ఆపరేషన్లు, బావులల్లో గంబూషియా చేపల విడుదల లాంటి చర్యలు తీసుకుంటున్నారు.   సర్కిల్‌  పరిధిలో అధికంగా  నాలాలు ఉన్నాయి.  వ్యాపార వాణిజ్య కేంద్రాలు సైతం ఎక్కువగా ఉండడంతో అధికమొత్తంలో చెత్త పోగవుతుంటుంది. ఈ ప్రాంతాలల్లో అపరిశుభ్రమైన వాతావరణం, పేరుకుపోయిన చెత్త, మురికి నీటి నిల్వతో దోమలు వృద్ధి చెందుతున్నాయని గమనించిన అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. 

మలేరియా దోమల నివారణకు నగర మున్సిపల్‌ అధికారులు ప్రతి నెల నిధులు బారిగానే వెచ్చిస్తున్నారు. దోమలు ఎక్కువగా ఉన్నా చోట ప్రత్యేక డ్రైవ్‌లతో ఫాగింగ్‌ చేస్తున్నారు. మురికి నీటి కాలువలు,నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కెమికల్స్‌ చల్లుతున్నారు.  బేగంపేట  సర్కిల్‌ పరిధిలో నాలుగు డివిజన్‌లో ఉన్నాయి. జోనల్‌ పరిధిలో మొత్తంగా 10 డివిజన్‌లకు గాను 9 ఫాగింగ్‌ మిషన్లు పనిచేస్తున్నాయి. 170 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ప్రతి రోజు బస్తీలు, కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ నిల్వ నీటి ప్రాంతాలలో యాంటి లార్వా ఆపరేషన్‌ చేస్తున్నారు. 

దోమల  నివారణకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాం

ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో  దోమల  నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం.  ప్రధానంగా సర్కిల్‌ పరిధిలో  చేతిపంపులు,  బావులలో గంబూషియా చేపలను వేస్తున్నాం.  జోనల్‌ పరిధిలో మౌంటెడ్‌ ఫాగింగ్‌ మిషన్‌ను కూడా వినియోగిస్తున్నాం నిధులు కూడా ప్రభుత్వం నుంచి సరిపడా అందుతున్నాయి.  ప్రతి నెలా డివిజన్‌ల వారిగా ఫాగింగ్‌ చేయిస్తున్నాం. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఫాగింగ్‌ యంత్రంతో  దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. దుర్గాప్రసాద్‌ (సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ )

VIDEOS

logo