మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 17, 2021 , 04:30:15

సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు

సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు

నేరేడ్‌మెట్‌, : పార్టీని అడ్డుపెట్టుకొని నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే సహించేదిలేదని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. యాప్రాల్‌ స్థానికులు, బాధితుల ఫిర్యాదు మేరకు శనివారం బండబాయి గుంటా, కటికలకుంట ప్రభుత్వ స్థలాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం యాప్రాల్‌లోని బొడ్డు కమలమ్మ దేవాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు, చెరువు అలుగుల ప్రాంతాల్లో కబ్జాలకు పాల్పడితే ఎవరైనా సహించేది లేదని హెచ్చరించారు.బండబాయి గుంట, కటికల కుంట స్థలాల కబ్జా విషయమై ఆర్‌డీవో దృష్టికి తీసుకెళ్లి.. ఆయనతో ఫోన్‌ ద్వారా సమస్యను వివరించారు. అదేవిధంగా ఓ మహిళ తన స్థలాన్ని ఓ నాయకుడు కబ్జా చేశాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే  తప్పు చేసిన వారు ఎవరైనా సహించేదిలేదని స్పష్టం చేశారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ మీనా ఉపేందర్‌ రెడ్డి, కార్పొరేటర్‌ జగదీశ్‌ గౌడ్‌, సీనియర్‌ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, కొమ్ము ఉమాదేవి యాదవ్‌, నాయకులు ఉపేందర్‌రెడ్డి, రావుల అంజయ్య, సతీశ్‌ కుమార్‌, మొటె సాయికుమార్‌, చిత్ర గోకుల్‌ కుమార్‌, ఎస్‌ఆర్‌ ప్రసాద్‌, మహేశ్‌, నారాయణరెడ్డి, జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo