మంగళవారం 02 మార్చి 2021
Hyderabad - Jan 17, 2021 , 04:27:10

సేవలోనే ఆనందం

సేవలోనే ఆనందం

మారేడ్‌పల్లి, :పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు పిలుపునిచ్చారు. శనివారం సేవా భారత్‌, వైఎంసీఏ గ్రేటర్‌ హైదరాబాద్‌ సంయుక్తాధ్వర్యంలో  సికింద్రాబాద్‌ వైఎంసీఏ హాల్‌లో 300 మంది పేదలు, జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ...లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది మనవతా వాధులు పేద ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారని గుర్తుచేశారు.  సేవ చేయడంలోనే మనిషికి సంపూర్ణ ఆనందం లభిస్తుందని చెప్పారు. సేవా భారత్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ వైఎంసీఏ ప్రతినిధులు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. సేవా భారత్‌ మినీ స్ట్రీస్‌ డైరెక్టర్‌ ప్రభుదాస్‌, వైఎంసీఏ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు జయకర్‌ డేనియల్‌ మాట్లాడుతూ...కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా  లక్షల పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌, హెచ్‌యూజే అధ్యక్షుడు ఈ. చంద్రశేఖర్‌, వైఎంసీఏ ప్రతినిధులు కిరణ్‌కుమార్‌, సంపత్‌, జీమ్స్‌ కెన్నెత్‌, ప్రతీక్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo