నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!

- కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
- దశల వారీగా టీకాలు.. తొలివిడుత వైద్య సిబ్బందికి
- నేరేడ్మెట్లో మొదటి టీకా వేసుకున్న డాక్టర్ రెడ్డి కుమారి, అల్వాల్‌లో ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ శైలజ
- వ్యాక్సినేషన్‌పై అపోహలొద్దు..
నేరేడ్మెట్ : కరోనా టీకాపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, కరోనా టీకాలు సురక్షితమని, నిర్భయంగా వేసుకోవచ్చని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం నేరేడ్మెట్ డివిజన్లోని ప్రాథమిక వైద్యశాలలో కరోనా టీకా కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, డాక్టర్స్, అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు మొదటి విడుతగా 190 డోసులు వచ్చాయన్నారు. మొదటి టీకా వైద్యురాలు డాక్టర్ రెడ్డి కుమారి వేసుకోగా అనంతరం 30మంది హెల్త్ వర్కర్లు వేసుకోనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. ప్రజలు భయపడొద్దు ఆ భయాన్ని పోగొట్టడానికి వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలిటీకా తీసుకుంటున్నారని అన్నారు. టీకా పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వద్దన్నారు. మనం ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాక్సిన్లు వాడుతున్నామని, కొన్ని టీకాలు వేసిన తర్వాత రియాక్షన్లు కనిపిస్తాయని తెలిపారు. ఇది అత్యంత సాధారణమని చెప్పారు. కొందరికి టీకా వేసిన తర్వాత జ్వరం వస్తుందని గుర్తుచేశారు. దీనర్థం వ్యాక్సిన్‌కు శరీరం ప్రతిస్పందిస్తుందని, అంతేగానీ సైడ్ ఎఫెక్ట్ కావని చెప్పారు.
హెల్త్ వర్కర్లు ఆదర్శనీయలు - డాక్టర్ రెడ్డి కుమారి
వైద్య సిబ్బంది గత 10 నెలలుగా వైరస్‌పై పోరాడుతున్నారని డాక్టర్ రెడ్డి కుమారి గుర్తు చేశారు. ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచేందుకు వ్యాక్సిన్‌ను మొదటి వ్యాక్సిన్ నేనే తీసుకున్ననని అన్నారు. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. కొందరికి రక్తం తొందరగా గడ్డకట్టదని, వారికి టీకా ఇవ్వబోమని చెప్పారు. కండరాల్లో టీకా ఇస్తారని, అందువల్ల స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా బీపీ, షుగర్ వారికి కూడా టీకాలు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీ దశరథ్, నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ ఎ.నర్సింహస్వామి, కార్పొరేటర్లు సునితా రాముయాదవ్, జగదీశ్ గౌడ్, బద్దం పరశురాంరెడ్డి, కొమ్ము ఉమాదేవి యాదవ్, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి, రావుల అంజయ్య, మొటె సాయికుమార్, చిత్ర గోకుల్ కుమార్, ఎస్ ఆర్ ప్రసాద్, సతీశ్‌కుమార్, జీవకన్, కరంచంద్, రాముయాదవ్, చెన్నారెడ్డి, మడిపడిగె జగదీశ్‌గౌడ్, మహేశ్, టిక్కం, నారాయణరెడ్డి, జాన్ తదితరులు పాల్గొన్నారు.
దశలవారీగా టీకాలు: ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
అల్వాల్, జనవరి 16 : ప్రజారోగ్య రక్షణే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర ప్రజలను కారోనా బారి నుంచి రక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. కరోనా వ్యాక్షినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం అల్వాల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్షిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తొలగించేందుకుగాను మొదటగా 30 మంది ఆరోగ్య శాఖ సిబ్బందికే వ్యాక్షిన్‌ను వేసినట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు వేసిన అనంతరం దశలవారీగా ప్రతిఒక్కరికీ టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.
మొదటి టీకా మెడికల్ ఆఫీసర్కే
అల్వాల్‌లో లాంఛనంగా కరోనా వ్యాక్షినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి టీకాను అల్వాల్ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ శైలజ తీసుకుంది. మొదటి టీకాను తీసుకున్న అనంతరం అరగంటవరకు మెడికల్ అఫీసర్ శైలజ ఆరోగ్య పరిస్థితులను గమనించిన అనంతరం మిగతా ఆరోగ్య శాఖ సిబ్బందికి టీకాలను వేయడం జరిగింది.
తాజావార్తలు
- Mi 10T 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింపు
- వీడియో : అభినవ పోతన ఈ రైతన్న...
- మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం