Hyderabad
- Dec 22, 2020 , 06:24:20
VIDEOS
రూ.31కోట్లతో చెరువుల అభివృద్ధి

మియాపూర్, డిసెంబరు 21 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గంగారం, పటేల్ చెరువుల సుందరీకరణ పనులపై విప్ అరెకపూడి గాంధీ సోమవారం మియాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువుల అభివృద్ధికి రూ.31.26 కోట్ల నిధులతో పనులను చేపడుతున్నట్లు అసంపూర్తి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. చెరువులకు సమీపంగా ఉన్న యజమానులతో చర్చించి పనులకు ఆటంకం కలగకుండా వేగవంతం చేయాలన్నారు. చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి పచ్చదనంతో కళకళలాడేలా చేయాలని విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ మురళీకృష్ణ, ఈఈ హైదర్‌ఖాన్, డీఈ పవన్‌కుమార్, ఏఈ శేషగిరిరావు, తహసీల్దార్ వంశీమోహన్, ఆర్ఐలు చంద్రారెడ్డి, మహిపాల్, సిటీ ప్లానర్ శ్రీనివాస్, ఏసీపీ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING