శనివారం 23 జనవరి 2021
Hyderabad - Dec 06, 2020 , 06:26:46

మెడిసిన్‌ విద్యార్థిని ఆత్మహత్య

మెడిసిన్‌ విద్యార్థిని ఆత్మహత్య

  • ఆలస్యంగా వెలుగులోకి..

బేగంపేట : మానసిక ఒత్తిడితో ఓ మెడిసిన్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా, నర్సంపేటకు చెందిన దంపతులకు ఝాన్సీ (35)తోపాటు మరో ఇద్దరు సంతానం. దంపతులు స్థానికంగా బట్టల వ్యాపారం చేస్తున్నారు.  ఝాన్సీ  బేగంపేట, ప్రకాశ్‌నగర్‌లో ఉంటూ సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానలో మెడిసిన్‌లో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ది. కరోనా కాలం నుంచి ఝాన్సీ ఒక్కతే ఫ్లాట్‌లో ఉంటుంది. ప్రతి రోజు తప్పకుండా క్లాస్‌లకు హాజరవుతుండేది .

కాగా.. ఈ నెల 2 నుంచి క్లాస్‌లకు రాక  పోవడంతో కళాశాల ప్రిన్సిపాల్‌.. ఝాన్సీకి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ రావడంతో.. ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. దీంతో ఝాన్సీ అక్క.. తన కుమారుడు సుశాంత్‌ను ఇక్కడికి పంపించింది. అతడు 4వ తేదీన ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా ఝాన్సీ ఆత్మహత్య చేసుకొని కనిపించింది.  వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. కొంతకాలంగా పెండ్లి విషయమై తల్లిదండ్రులు ఝాన్సీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో కొంత మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 logo