బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Dec 03, 2020 , 08:22:33

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు ‘కువెంపు భాషా భారతి’ అవార్డు

 హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు ‘కువెంపు భాషా భారతి’ అవార్డు

కొండాపూర్‌ : గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం సెంటర్‌ ఫర్‌ ఐప్లెడ్‌ లింగ్విస్టిక్స్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ (సీఏఎల్‌టీఎస్‌) విభాగానికి చెందిన ప్రొఫెసర్లు ఇందిరా భాయ్‌ పుస్తకాన్ని కన్నడ నుంచి ఆంగ్లంలోకి అనువదించినందుకు గాను ప్రతిష్టాత్మక ‘కువెంపు భాషా భారతి’ ప్రాధికార వార్షిక పుస్తక అవార్డుకు శివారామ పడిక్కల్‌ ఎంపికైనట్లు వర్సిటీ యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. వర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఐప్లెడ్‌ లింగ్విస్టిక్స్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్‌ శివరామ పడిక్కల్‌, ప్రొఫెసర్‌ వనమాల విశ్వనాథ ఇందిరా భాయ్‌ పుస్తకాన్ని కన్నడ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. దీన్ని గుర్తించిన మినిస్ట్రీ ఆఫ్‌ కన్నడ అండ్‌ కల్చర్‌, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కువెంపు భాషా భారతి ప్రాధికార అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కాగా ఇందిరా భాయ్‌ పుస్తకం గుల్వడి వెంకటరావు యొక్క మొదటి ఇండిపెండెంట్‌ సోషల్‌ నవల. ఇటీవల ఇందిరా భాయ్‌ పుస్తకాన్ని మంగుళూరు యూనివర్సిటీ అండర్‌గ్రాడ్యుయేట్‌ బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ ద్వారా బీకామ్‌ చివరి సంవత్సర విద్యార్థుల పాఠ్యాంశాలలో చేర్చినట్లు తెలిపారు. logo