బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Dec 03, 2020 , 08:22:32

7న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆన్‌లైన్‌ శిక్షణ

7న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆన్‌లైన్‌ శిక్షణ

కుత్బుల్లాపూర్‌: వ్యాపార రంగంలో రాణించాలనే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్యూనర్‌ డెవలప్‌మెంట్‌(సీఈడీ) అలీప్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి ఉచితంగా ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సంస్థ సెక్రటరీ వై.త్రిపురాంబ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యానవన, పశుపోషణ, చేతివృత్తుల ఆధారిత ఉత్పత్తులకు గల అవకాశాలు, విలువలను పెంచడం, ఆత్మనిర్భర భారత్‌ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సెల్‌నంబర్‌7036666423, 8919186385లను సంప్రదించాలని కోరారు.

 


logo