శనివారం 16 జనవరి 2021
Hyderabad - Dec 03, 2020 , 08:17:22

ఐఏడీవీఎల్‌ రాష్ట్ర శాఖ నూతన కమిటీ ఎన్నిక

ఐఏడీవీఎల్‌ రాష్ట్ర శాఖ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా డాక్టర్‌ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ భూమేశ్‌ కుమార్‌

బన్సీలాల్‌పేట్‌ : చర్మ, లైంగిక, కుష్ఠు వ్యాధి వైద్యుల సంఘం, (ఐఏడీవీఎల్‌) రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ డీబీఎన్‌.మూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ కటకం భూమేశ్‌ కుమార్‌, కోశాధికారిగా డాక్టర్‌ బీ.జనార్దన్‌ను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన డాక్టర్‌ డీవీఎస్‌.ప్రతాప్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా గాంధీ దవాఖాన చర్మవ్యాధుల విభాగంలో పనిచేస్తున్న డాక్టర్‌ భూమేశ్‌ కటకం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ఐఏడీవీఎల్‌ ద్వారా కొత్తవారిని రాష్ట్ర కమిటీలో ఎన్నుకుంటారని, గతంలో తాను సైంటిఫిక్‌ చైర్మన్‌గా పనిచేయగా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తమ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా చర్మ, లైంగిక, కుష్ఠు వ్యాధుల నివారణపై ప్రజలను చైతన్యపరిచేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ రంగం లో వస్తున్న తాజా మార్పులపై  వైద్యులకు కూడా అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని డాక్టర్‌ భూమేశ్‌ తెలిపారు.