ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Nov 30, 2020 , 07:59:21

సమగ్రంగా.. ప్రణాళికాబద్ధంగా.. అభివృద్ధి చేసుకుందాం..

సమగ్రంగా.. ప్రణాళికాబద్ధంగా.. అభివృద్ధి చేసుకుందాం..

ఎల్బీనగర్‌ : ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని డివిజన్లను సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుందామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్‌ సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి రోజున నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ఆయన పర్యటించారు. గడ్డిఅన్నారం డివిజన్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని డివిజన్లలో జరిగిన అభివృద్ధికి ప్రజలు ఓటేయాలని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌ నగరం ప్రశాంతంగా ఉందని, అంతర్జాతీయ హంగులను సమకూర్చుకుంటున్నదన్నారు. 

ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు గెలిపించి, గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని అధిరోహించేలా కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. గడ్డిఅన్నారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భవానీ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ గడ్డిఅన్నారం డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్‌రావు, పీచర వెంకటేశ్వర్‌రావు, తులసీ శ్రీనివాస్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.