ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:27:48

త్వరలోనే ఆర్‌యూబీని ప్రారంభిస్తాం

త్వరలోనే ఆర్‌యూబీని ప్రారంభిస్తాం

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు 

మల్కాజిగిరి, సెప్టెంబర్‌17 : త్వరలోనే ఆర్‌యూబీని ప్రా రంభించనున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీ పనుల ను ఎమ్మెల్యే అధికారులతో కలిసి గురువారం  పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్‌యూబీ పనులు చివరి దశకు చేరాయని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అం దుబాటులోకి తీసుకొస్తామన్నారు. పనులు పూర్తయ్యే వరకు అధికారులు ప్రతిరోజు పనులను పర్యవేక్షించాలన్నారు. ఎమ్మె ల్యే వెంట అధికారులు రవీందర్‌, మణిబాబు కార్పొరేటర్లు నిరుగొండ జగదీశ్‌గౌడ్‌, శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, జీఎన్‌వీ.సతీశ్‌కుమార్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్‌, రాంచందర్‌, సిద్దిరాములు పాల్గొన్నారు. 

మంత్రి కేటీఆర్‌ చొరవతోనే విస్తరణ పనులు

గౌతంనగర్‌ : మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతోనే మౌలాలి కమాన్‌ రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలిగిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మౌలాలి కమాన్‌ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి రోడ్డు వైండింగ్‌ సమస్య ఉందని తాను ప్రత్యేక దృష్టి సారించి కమాన్‌ ఇరువైపుల ఉన్న వ్యాపార సముదాయ యజమానులతో చర్చలు జరిపి రోడ్డు విస్తరణ పనులు అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రోడ్డు విస్తరణలో భూ నిర్వాసితులకు రూ. 3కోట్ల 27లక్షల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఎన్‌.జగదీశ్‌గౌడ్‌, ప్రేమ్‌కుమార్‌, అమీనొద్దీన్‌, పిట్ల శ్రీనివాస్‌, జీవీఎన్‌ సతీశ్‌ కుమార్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, భాగ్యనందరావు, సంతోష్‌నాయుడు, ఆదినారాయణ, ఉపేందర్‌ పాల్గొన్నారు.