శనివారం 16 జనవరి 2021
Hyderabad - Sep 10, 2020 , 04:09:45

కాళోజీ రచనలు మానవాళికి స్ఫూర్తి

కాళోజీ రచనలు మానవాళికి స్ఫూర్తి

మియాపూర్‌: ప్రజా కవి కాళోజీ నారాయణ  జయంతిని వివేకానందనగర్‌ డివిజన్‌లోని తన కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ.. కాళోజీ రచనలు మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్‌ గణేశ్‌, గంథం రాములు, పార్టీ నేతలు పురుషోత్తం, శేరిలింగంపల్లి, కొండాపూర్‌ డివిజన్ల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు రాజుయాదవ్‌, కృష్ణ గౌడ్‌, బ్రిక్‌ శ్రీను, నటరాజు, తిరుపతి, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట నగర పాలక సంస్థ కార్యాలయంలో..

 దుండిగల్‌ : నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ప్రాంగణంలో ప్రజాకవి, పద్మవిభూషన్‌, డా. కాళోజీ నారాయణరావు జయంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్‌ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ధన్‌రాజు, కమిషనర్‌ గోపి, కార్పొరేటర్లు ఏనుగుల శ్రీనివాస్‌రెడ్డి, చల్లా ఇంద్రజిత్‌రెడ్డి, బాలాజీనాయక్‌, సురేశ్‌రెడ్డి, శ్రీరాములు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- గాజులరామారం: స్థానిక సమస్యల పరిస్కారినికి కార్పొరేటర్లు బస్తీబాట నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం గాజులరామారం కార్పొరేటర్‌ రావుల శేషగిరి డివిజన్‌ పరిధిలోని రావినారాయణరెడ్డినగర్‌లో పర్యటించి బస్తీవాసులను సమస్యలను అడిగి తెలుకున్నారు. 

- జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలోని దేవమ్మబస్తీలో బుధవారం కార్పొరేటర్‌ జగన్‌ బస్తీబాట నిర్వహించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- కొండాపూర్‌ : కొండాపూర్‌ డివిజన్‌ అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలంటూ కార్పొరేటర్‌ షేక్‌ హమీద్‌ పటేల్‌ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. 

- శేరిలింగంపల్లి: గోపినగర్‌లో చేపట్టిన అంతర్గత రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ పరిశీలించారు. ఆయన వెంట ఏఈ సునీల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింహ గౌడ్‌, పుట్ట వినయకుమార్‌ గౌడ్‌, కలివేముల వీరేశం గౌడ్‌, నర్సింహ, విజయలక్ష్మి, రవీందర్‌, చెన్నప్ప, నారాయణ, లక్ష్మీపతి, పద్మ, ఆనంద్‌, కృష్ణ, నెహ్రూనగర్‌ కాలనీ టీఆర్‌ఎస్‌ బస్తీ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్‌, యూత్‌ కమిటీ అధ్యక్షుడు మహేందర్‌ సింగ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదగిరి తదితరులు ఉన్నారు. 

- శేరిలింగంపల్లి: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ జోన్‌ అడిషనల్‌ డీసీపీగా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వర్లు పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన బుధవారం మాదాపూర్‌ జోన్‌ డీసీపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలిపారు.