కొన్ని తేదీలు అలా చరిత్రలో నిలిచిపోతాయంతే. అలా తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన తేదీ ఏప్రిల్ 28. ఆ రోజుకు ఓ చరిత్ర ఉంది. ఆ రోజు రిలీజైన సినిమాలు హిస్టరీ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా మూడు సినిమాలు ఎప్పటికప్పుడు తెలుగు సినీ చరిత్రనే మార్చేశాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దామా..
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా అడవి రాముడు. 1977లో విడుదలైన ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ చెరిపేసింది. కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసి అప్పట్లో చరిత్ర తిరగరాసింది. కమర్షియల్ సినిమాకు సరికొత్త అర్థం చెప్తూ వచ్చిన అడవి రాముడు అన్నగారి ఇమేజ్ తో పాటు మార్కెట్‌ను కూడా మరింత పెంచేసింది. అప్పట్లో ఈ సినిమా పాటలు కూడా పెద్ద హిట్టే.
అడవి రాముడు తర్వాత మరోసారి ఏప్రిల్ 28న ఇంకో సినిమా విడుదలైంది. అదే పోకిరి. మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను పూర్తిగా తుడిచేసింది ఈ చిత్రం. ఒకటి రెండు కాదు రూ.39 కోట్ల షేర్ వసూలు చేసి పోకిరి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. అడవి రాముడు అప్పట్లో మార్కెట్‌ను పెంచేస్తే.. పోకిరి ఎంత బడ్జెట్ అయినా వర్కవుట్ అవుతుందనే నమ్మకాన్ని పెంచేసింది. ఈ సినిమాతోనే ఇలియానా స్టార్ హీరోయిన్ అయిపోయింది.
పోకిరి విడుదలైన 11 ఏళ్లకు మళ్లీ అదే రోజు ఇంకో సినిమా విడుదలైంది. అదే బాహుబలి 2. పోకిరి కేవలం తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తే.. బాహుబలి 2 మాత్రం ఏకంగా ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. అసలు మన సినిమాలకు ఇంత స్టామినా ఉందా అని అంతా ఆశ్చర్యపోయేలా చరిత్ర తిరగరాసింది బాహుబలి 2. ప్రపంచ వ్యాప్తంగా 1700 కోట్లకు పైగా గ్రాస్.. 1200 కోట్ల నెట్.. 815 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాతో రాజమౌళి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఏప్రిల్ 28నే కాదు అంతకంటే ఒక్కరోజు ముందు.. అంటే ఏప్రిల్ 27న విడుదలైన ఖుషి కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.తమిళనాట బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఖుషి సినిమాను అదే పేరుతో పవన్ కళ్యాణ్, భూమిక జంటగా రీమేక్ చేశాడు దర్శకుడు సూర్య. వరస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కెరీర్లో ఏడో చిత్రంగా 2001లో వచ్చింది ఖుషి. సెవెన్త్ వండర్ అంటే ఏంటో చూపించింది. ఆ సమయానికి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ చిత్రం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
F3 రిలీజ్ అయ్యేది అప్పుడే.. సెంటిమెంట్ నమ్ముకుంటున్న అనిల్ రావిపూడి
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
కరోనా నుంచి కోలుకున్నా: అనిల్ రావిపూడి
జబర్దస్త్ కమెడీయన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మానందం!
తేలికపాటి లక్షణాలే, కంగారు పడొద్దు: పూజా హెగ్డే
అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..!
ఉప్పెన హీరోయిన్ డూప్.. వైరల్ అవుతున్న ఫొటోస్