బుధవారం 05 ఆగస్టు 2020
Hyderabad - Jul 10, 2020 , 01:00:05

ఏది నిజం.. ఎవరిని నమ్మాలి.. మదిలో మెదులుతున్న ప్రశ్న!

ఏది నిజం.. ఎవరిని నమ్మాలి.. మదిలో మెదులుతున్న ప్రశ్న!

ఏది నిజం.. ఎవరిని నమ్మాలి.. ఏవి పాటించాలి... ఇది ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న.. డబ్ల్యూహెచ్‌వో సైతం మూడు దశల్లో దాదాపు పదిహేను రకాల లక్షణాలను ప్రకటించింది. ఈ క్రమంలోపలువురు నిపుణులు రకరకాల మార్గాల ద్వారా వైరస్‌ విజృంభిస్తున్నదని తెలుపుతున్నారు. ఇవి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి. వైరస్‌ను కట్టడిచేసే క్రమంలో చేసిన ప్రయత్నాలుగానే స్పష్టమవుతున్నది. కాని ఇప్పటికీ ఈ వైరస్‌ ఎలా పుడుతున్నది.. ఎలా వ్యాప్తి చెందుతుందనేది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. ఇదే క్రమంలో వైరస్‌ విస్తరణ ప్రారంభమైన మూడునెలల తర్వాత గాలిద్వారా సైతం కరోనా సోకవచ్చునని పలువురు నిపుణులు తెలుపుతుండటంతో ప్రజలకు ఊపిరి ఆగిపోయినంత పని అవుతున్నది. మొదటగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్‌ సోకుతుందని ఆరోగ్యసంస్థ పేర్కొనగా ఇటీవల గాలి, తుంపర్ల ద్వారా సైతం వైరస్‌ వ్యాప్తి చెందుతుందని పలువురు వైద్యనిపుణులు వాదించగా ఆరోగ్య సంస్థ సైతం ఇది నిజమేనని చెప్పకనే చెప్పేసింది. ఇదిలా ఉండగా వైరస్‌ శరీరం మొత్తంపై ప్రభావం చూపుతుందనే చేదునిజం తాజాగా బయటపడింది. ముఖ్యంగా మెదడు, వెన్నుపూస రెండింటికీ ఎఫెక్ట్‌ ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వైరస్‌ సోకినవారికి చికిత్సచేయడంలో వైద్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వైరస్‌ పుట్టుక, లక్షణాలు స్పష్టంగా నిర్ధారణ కాకపోవటంతో రోగి లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందిస్తూ ప్రాణంపోస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఈ వైరస్‌ గాలిలో పుట్టి గాలిద్వారానే విస్తరిస్తున్నదని ఒక అవగాహనకు రావడంతో మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. 

ఖైరతాబాద్‌లో 72 మందికి..

ఖైరతాబాద్‌ : ఖైరతాబాద్‌ సర్కిల్‌లో గురువారం 72మందికి పాజిటివ్‌ వచ్చింది. ఖైరతాబాద్‌లో 35, సోమాజిగూడలో 10, అమీర్‌పేటలో 19, సనత్‌నగర్‌లో 8 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

యూసుఫ్‌గూడలో 29 మందికి..

వెంగళరావునగర్‌: యూసుఫ్‌గూడ సర్కిల్‌లో 29మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో 11, బోరబండలో 10 , రహ్మత్‌నగర్‌లో 5, ఎర్రగడ్డ డివిజన్‌లో 2 , వెంగళరావునగర్‌ 1 పాజిటివ్‌ కేసు నమోదైంది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌కు(55) పాజిటివ్‌ వచ్చింది.

  • ఎల్బీనగర్‌ : ఎల్బీనగర్‌ జోన్‌ మూడు సర్కిళ్ల పరిధిలో 26 మందికి పాజిటివ్‌ వచ్చింది.
  • దుండిగల్‌ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో గురువారం 23 మందికి పాజిటివ్‌ వచ్చింది.
  • హిమాయత్‌నగర్‌: హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో 17మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 
  • బోడుప్పల్‌ : బోడుప్పల్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  
  • రామంతాపూర్‌ : ఉప్పల్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలో 10మందికి వైరస్‌ సోకింది.
  • అహ్మద్‌నగర్‌ : అహ్మద్‌నగర్‌, చింతల్‌బస్తీ,  శాంతినగర్‌లో 18మందికి పాజిటివ్‌ వచ్చింది.
  • కాప్రా : కాప్రాసర్కిల్‌లో తొమ్మిదిమందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 
  • బాలానగర్‌ : మూసాపేట సర్కిల్‌ ఫతేనగర్‌ పిట్టల బస్తీలో ఒకరికి, మాధవరంకాలనీలో ఒకరికి కరోనా సోకినట్లు డాక్టర్‌ చందర్‌ తెలిపారు.
  • నేరేడ్‌మెట్‌ : నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి సాయినాథ్‌పురంలో నివాసముంటున్న ఓ వ్యక్తి (88) దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.  
  • తెలుగుయూనివర్సిటీ : నిలోఫర్‌ దవాఖానలో ఆరుగురు గర్భిణులు, ముగ్గురు ఉద్యోగులు, ఓ చిన్నారికి పాజిటివ్‌ వచ్చింది.

500 మంది సిబ్బంది నుంచి నమూనాల సేకరణ బాలామృతం ఇక్కడినుంచే సరఫరా

ఉప్పల్‌ : నాచారంలోని తెలంగాణఫుడ్స్‌లో పనిచేస్తున్న సిబ్బందిలో 11 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణఫుడ్స్‌లో పనిచేస్తున్న మొత్తం 500మంది నుంచి నమూనాలు సేకరించారు. అయితే అంగన్‌వాడీ చిన్నారుల కోసం బాలామృతం ఇక్కడి నుంచే తయారు చేసి పంపిస్తారు. ఈ మేరకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, వైద్యాధికారిణి డా.పల్లవి, ఆర్‌ఐ రామకృష్ణారెడ్డి, ఏఎస్సై లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

శాంతా బయోటెక్‌లో కార్మికుడికి పాజిటివ్‌

మేడ్చల్‌ రూరల్‌ : అత్వెల్లి శాంతా బయోటెక్‌ కంపెనీలో పనిచేస్తూ చంద్రానగర్‌లో నివాసముంటున్న యువకుడికి (34), మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని స్లీప్‌వెల్‌ కంపెనీలో పనిచేస్తున్న మరో యువకుడికి(35) పాజిటివ్‌ వచ్చింది.


logo