గురువారం 22 అక్టోబర్ 2020
Hyderabad - Jul 09, 2020 , 23:39:00

పరీక్షలు.. వెంటనేఫలితాలు

 పరీక్షలు.. వెంటనేఫలితాలు

హఫీజ్‌పేట్‌, జూలై9: నగరంలో కరోనావైరస్‌ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కొవిడ్‌ పరీక్షల సామర్థ్యాన్ని పెంచడమేగాకుండా మరింతవేగంగా ఫలితాలను అందించే ఉద్దేశంతో ఇప్పుడు పట్టణప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రైమరీ కాంటాక్టుతో సంబంధమున్న అనుమానితులు, కొవిడ్‌ లక్షణాలున్న వ్యక్తుల నుంచి నమూనాలు స్వీకరించి అర్ధగంటలో అప్పటికప్పుడు పరీక్షాఫలితాలను అందిస్తున్నారు. గురువారం హఫీజ్‌పేట్‌ పట్టణ ఆరోగ్యవైద్య కేంద్రంలో 25 మంది నమూనాలు స్వీకరించి పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

ఎల్లమ్మబండ ఆరోగ్య కేంద్రంలో..

హైదర్‌నగర్‌, జూలై 9 : ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ ఎల్లమ్మబండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టులను కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు జిల్లా గణేశ్‌, కాశీనాథ్‌యాదవ్‌, పోశెట్టి గౌడ్‌, బోయ కిషన్‌, మున్న తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గం పట్టణ ఆరోగ్య కేంద్రంలో 

శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని రాయదుర్గం పట్టణ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ -19 టెస్టులు నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు ప్రభుత్వం అందజేసిన పీపీఈ కిట్లతో టెస్టుల నిర్వహణ చేపడుతున్నారు. రోజుకు 25 మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. బుధవారం 5, గురువారం ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు తెలిపారు. డాక్టర్‌ ఆఫ్షా అంజుమ్‌, స్టాఫ్‌ నర్సు మౌనిక, ల్యాబ్‌ టెక్నీషియన్‌ క్రాంతి, సిబ్బంది నీరజ, ఆశ టెస్టులు నిర్వహించారు. 


logo