మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Jul 09, 2020 , 23:38:55

‘ఎంటమాలజీ’ సేవలు మరువలేనివి

‘ఎంటమాలజీ’ సేవలు మరువలేనివి

చందానగర్‌: కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో పనిచేస్తున్న ఎంటమాలజీ సిబ్బందికి ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు బొబ్బ నవతారెడ్డి, జగదీశ్వర్‌గౌడ్‌, పూజిత గౌడ్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా అహర్నిశలు శ్రమిస్తున్న జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌, ఎంటమాలజీ సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ నియంత్రణకు కృషి చేసిన వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కొవిడ్‌ నివారణ చర్యలపై తగిన జాగ్రత్తలను వివరించారు. ఇందులో భాగంగా భద్రతకు సంబంధించిన మాస్క్‌లు, సేఫ్టీ జాకెట్‌, రేయిన్‌ కోర్ట్‌, గ్లౌవ్స్‌, షూస్‌, సబ్బులు, శానిటైజర్‌ వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్‌, చందానగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, సీనియర్‌ ఎంటమాలజీ మల్లయ్య, సర్కిల్‌ ఎంటమాలజీ గణేశ్‌, రాజేశ్‌, శ్రీనివాస్‌, బాలాగౌడ్‌ పాల్గొన్నారు. 


logo