బుధవారం 05 ఆగస్టు 2020
Hyderabad - Jul 03, 2020 , 02:22:24

అభివృద్ధి పనులను కాలనీవాసులు పర్యవేక్షించాలి

అభివృద్ధి పనులను కాలనీవాసులు పర్యవేక్షించాలి

 ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

వనస్థలిపురం, జూలై 2 : నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కార్పొరేటర్‌ పద్మానాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అదే విధంగా హనుమాన్‌నగర్‌ కాలనీలో నూతనంగా నిర్మించిన పార్కు, ఇంద్రప్రస్తా కాలనీలో నిర్మించిన ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు కాలనీ వాసులు పర్యవేక్షించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎల్బీనగర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు రఘుమారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, కాలనీ అధ్యక్షుడు నర్సయ్య, కిషోర్‌, కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.logo