బుధవారం 05 ఆగస్టు 2020
Hyderabad - Jul 03, 2020 , 02:22:23

అందరికీ అందుబాటులో.. ఓపెన్‌జిమ్‌లు

అందరికీ అందుబాటులో..   ఓపెన్‌జిమ్‌లు


ఎల్బీనగర్‌ జోన్‌ వ్యాప్తంగా 

డివిజన్‌కు  ఒక్కటి చొప్పున 23 ఓపెన్‌ జిమ్‌లు 

మొత్తం రూ. 3.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు

జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్‌ జోన్‌లో వార్డుల వారీగా 

ఓపెన్‌ జిమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. 

ఎల్బీనగర్‌ జోన్‌లోని ఐదు సర్కిళ్లలో 23 డివిజన్లకు గాను 23 ఓపెన్‌ జిమ్‌లు ప్రారంభిస్తున్నారు. వీటిలో ఇప్పటికే చాలా వరకు ఓపెన్‌ జిమ్‌లను ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రారంభోత్సవం చేశారు. మొత్తం రూ.3 కోట్ల పది లక్షలతో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.  

                                       -ఎల్బీనగర్‌

ఒక్కో ఓపెన్‌ జిమ్‌లో అధునాతన పరికరాలు 

 ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని కాప్రా, ఉప్పల్‌, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలోని 23 డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌లో ఒక్కో ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభిస్తున్నారు. పార్కుల్లో ఏర్పాటు చేసిన  అధునాతన జిమ్‌లతో  వ్యాయా మం చేసే పరికాలు అమర్చారు. ఒక్కో ప్రాంతంలో అందుబాటులో ఉన్న పార్కుల వైశాల్యాన్ని బట్టి అక్కడ పరికరాలను అమర్చారు. కాప్రా సర్కిల్‌ పరిధిలో 6 , ఉప్పల్‌లో 4, హయత్‌నగర్‌లో  4 , ఎల్బీనగర్‌లో 4, సరూర్‌నగర్‌లో 5 డివిజన్లు ఉన్నాయి.  జిమ్‌ల ఏర్పాటుతో పాటు నిర్వహణ బాధ్యతలను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. సదరు ఏజెన్సీ  జిమ్‌ల ప్రారంభం మొదలుకుని ఐదు సంవత్సరాల పాటు ఈ జిమ్‌ల నిర్వహణ చేయాల్సి ఉంటుంది. 

ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు రూ. 3.10 కోట్లు 

  ఎల్బీనగర్‌ జోన్‌ వ్యాప్తంగా  ఉన్న 23 డివిజన్లలో రూ. 3.10 కోట్లతో అధునాతన హంగులతో  ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ఓపెన్‌ జిమ్‌లలో సుమారు 11 నుండి 13 రకాలైన వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచారు.

 23 ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు

    ఎల్బీనగర్‌ జోన్‌లోని 23 డివిజన్లలో 23 ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. రూ. 3.10 కోట్ల వ్యయంతో ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ఐదు సంవత్సరాల పాటు ఈ జిమ్‌ల ఏర్పాటుతో పాటుగా నిర్వహణను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాం.  

  - శంకర్‌లాల్‌ (ఎస్‌ఈ, ఎల్బీనగర్‌ జోన్‌) 


logo