మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 03, 2020 , 02:22:22

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడండి

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడండి

ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్‌

మెహిదీపట్నం : కార్వాన్‌ నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా జలమండలి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్‌ అన్నారు. గురువారం టోలిచౌకిలో జలమండలి డీజీఎం జవహర్‌ అలీతో ఆయనతోపాటు నానల్‌నగర్‌ కార్పొరేటర్‌ ఎండీ.నసీరుద్దీన్‌ సమావేశం అయ్యారు. గోల్కొండ, టోలిచౌకి, నానల్‌నగర్‌, లంగర్‌హౌస్‌ డివిజన్లలో తాగునీటి సరఫరా గురించి వరుసగా వస్తున్న ఫిర్యాదులపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లో జలమండలి అధికారులు చర్యలు తీసుకుని తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 


logo