మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 03, 2020 , 02:22:10

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

బడంగ్‌పేట: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తెలిపారు.  కార్పొరేషన్‌ పరిధిలోని మామిడిపల్లిలోని 11, 12,17 వ డివిజన్లతో పాటు, బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఇంటింటికీ ఉచితంగా మొక్కలు అందజేస్తున్నామన్నారు.  కార్యక్రమంలో కార్పొరేటర్లు యాతం పవన్‌ యాదవ్‌, శివకుమార్‌,  నియోజక వర్గం టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు నిమ్మల నరేందర్‌గౌడ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ గోపాల్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

కందుకూరు: గ్రామాలు పచ్చదనంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీవో విజయలక్ష్మి తెలిపారు.  గురువారం మండల పరిధిలోని దాసర్లపల్లి నర్సరీని పరిశీలించిన అనంతరం ఇంటింటికీ ఆరు మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పొలెమోని బాలమణి అశోక్‌ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

మణికొండ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నార్సింగి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని మురుగునీటి కాలువల్లో పేరుకు పో యిన చెత్తను తొలగింపజేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రోడ్ల వెంట చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 

పహాడీషరీఫ్‌:  పారిశుధ్య పనులపై ప్ర త్యేక దృష్టి సారిస్తున్నట్లు జల్‌పల్లి మున్సిపాలిటీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మోయిన్‌బాబా అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వాదియే ముస్తఫా కాలనీలో పలు చోట్ల పేరుకుపోయిన చెత్తను తొలగింపజేయించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ మున్సిపల్‌ అధికారులు కేటాయించిన స్థలంలోనే చెత్తను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ హరినాథ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు హుస్సేన్‌ తదితరులు  పాల్గొన్నారు.logo