మంగళవారం 11 ఆగస్టు 2020
Hyderabad - Jul 03, 2020 , 02:22:44

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

  ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

 మల్కారంలో రైతు వేదిక 

    నిర్మాణానికి శంకుస్థాపన 

శంషాబాద్‌: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. గురువారం శంషాబాద్‌లోని మల్కారంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కారం, హమీదుల్లానగర్‌లో ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అనంతరం మల్కారంలో రైతు బీమా చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్‌, సర్పంచ్‌లు కొత్త మాధవి, సతీష్‌,   ఎంపీడీవో జగన్మోహన్‌రావు, డీఎల్‌పీవో తరుణ్‌, ఏవో కవిత, పీ ఏసీఎస్‌ చైర్మన్‌ సతీష్‌, వైస్‌ చైర్మన్‌ నీలం నాయక్‌, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఫిరంగినాలా ప్రక్షాళన ..

మున్సిపాలిటీలోని ఫిరంగినాలా ప్రక్షాళనకు రూ. 10 లక్షలు మంజూరు కాగా  గురువారం హుడా కాలనీ వద్ద  పనులను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌ యాదవ్‌,  కమిషనర్‌ సాబేర్‌అలీ, నాయకులు చంద్రారెడ్డి, వెంకటేశ్‌, శ్రీనివాస్‌, రాజు,మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రుణాలు అందజేత..

 రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. గురువారం  శంషాబాద్‌  సహకార సంఘంలోని రైతులకు పంట రుణాలను పీఏసీఎస్‌ చై ర్మన్‌ మల్లారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాభదాయక వ్యవసాయ విధానాలకు ప్రభుత్వం శ్రీకా రం చుట్టిందన్నారు.   కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ జ్ఞానేశ్వర్‌, డైరెక్టర్లు నందకిశోర్‌, అరుంధతి, సత్తయ్య, శ్రీనివాస్‌, సులోచన, పోచయ్య, సీఈవో అర్జున్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హరిత హారంలో భాగస్వాములు కావాలి

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సూచించారు. గురువారం మల్కారం, హమీదుల్లానగర్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు మొక్కలు నాటాలని సూచించారు. 


logo