ఆదివారం 09 ఆగస్టు 2020
Hyderabad - Jul 03, 2020 , 00:32:12

నగరంలో దంచికొట్టిన వాన

నగరంలో దంచికొట్టిన వాన

నగరంలో దంచికొట్టిన వాన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  గురువారం రాత్రి గ్రేటర్‌లో వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి 10 గంటల వరకు రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 8.2 సెం.మీ., మూసాపేటలో అత్యల్పంగా 1.0 సెంటీమీటర్‌ వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు. రాజేంద్రనగర్‌ భవానీకాలనీ, అత్తాపూర్‌, మెహిదీపట్నం, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి, పటాన్‌చెరు, అమీర్‌పేట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజులు గ్రేటర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గరిష్ఠంగా 33.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.0 డిగ్రీలు, గాలిలో తేమ 64 శాతంగా నమోదైందని అధికారులు వెల్లడించారు. 

ప్రాంతం వర్షపాతం 

సెం.మీలలో

రాజేంద్రనగర్‌ 8.2

పటాన్‌చెరు 3.6

అమీర్‌పేట 2.7

ఖైరతాబాద్‌ 2.6

కూకట్‌పల్లి 2.5

గాజులరామారం 2.4

నాంపల్లి, మెహిదీపట్నం 2.1


శేరిలింగంపల్లి 1.7

ఆసిఫ్‌నగర్‌ 1.7

యూసుఫ్‌గూడ 1.5

బేగంపేట 1.4

గోల్కొండ,షేక్‌పేట 1.3

జూబ్లీహిల్స్‌ 1.2

కార్వాన్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ 1.1

బాలానగర్‌ మూసాపేట్‌ 1.0


logo