బుధవారం 21 అక్టోబర్ 2020
Hyderabad - Jun 07, 2020 , 23:44:28

ఎంజీబీఎస్‌లో క్రమక్రమంగా పెరుగుతున్న ప్రయాణికులు

ఎంజీబీఎస్‌లో క్రమక్రమంగా పెరుగుతున్న ప్రయాణికులు

సుల్తాన్‌బజార్‌ : లాక్‌డౌన్‌లో నిర్మానుష్యంగా మారిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో జిల్లాల బస్సులు రాక పోకలు సాగిస్తుండటంతో కళ కళ లాడుతోంది. మార్చి 22 నుంచి  ఆర్టీసీని పూర్తిగా నిలిపివేసిన విషయం విదితమే.  లాక్‌డౌన్‌లో భాగంగా గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో బస్సులు నడిపించాలనే యోచనలో ప్రభుత్వం మొదటగా నగర శివారు ప్రాంతాల వరకు ఆర్టీసీ బస్సులను నడిపించింది.  హైదరాబాద్‌ వరకు బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులు సూచించిన మేరకు ప్రభుత్వం జిల్లాల బస్సులను ఎంజీబీఎస్‌ వరకు అనుమతించింది.

నిత్యం 1800 బస్సులు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు 18 00 బస్సులు రాక పోకలు సాగిస్తున్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం ఎంజీబీఎస్‌కు బస్సుల రాకపోకలు ప్రారంభమైన మొదట ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నా..  క్రమక్రమంగా  పెరుగుతూ వస్తుంది.

పరిశుభ్రత చర్యలు ..

జిల్లాల నుంచి వచ్చిన బస్సులు ఎంజీబీఎస్‌కు చేరుకోగానే   బస్సు పూర్తి భాగాన్ని సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరుస్తున్నారు. ప్లాట్‌ఫారాలతో పాటు ఫ్లోర్‌లలో పరిశుభ్రతా చర్యలు తీసుకుంటున్నారు.

సిటీ బస్సులు నడిపేందుకు ఎల్లప్పుడూ సిద్ధం..

జిల్లాల వారిగా ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనా ప్రభుత్వం సిటీ బస్సులు, అంతర్రా ష్ట్ర బస్సుల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. సిటీ బస్సులకు   ప్రభుత్వం అనుమతించిన తక్షణమే బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు సిద్ధంగా ఉ న్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌ పేర్కొన్నారు.


logo