సోమవారం 13 జూలై 2020
Hyderabad - May 28, 2020 , 01:39:46

పెద్ద ఎత్తున నాలాల్లో పూడికతీత పనులు

పెద్ద ఎత్తున నాలాల్లో పూడికతీత పనులు

 ఖైరతాబాద్‌: వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వరద నీటి ముప్పును ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ అన్ని పక డ్భందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు ఖైరతాబాద్‌ సర్కిల్‌ 17లోని నాలాల పూడికతీత పనులను ముమ్మరం గా చేపడుతున్నారు. గత రెండేండ్లుగా వర్షాకాలంలో వరదనీటి సమస్య పూర్తిగా సమసిపోయింది. అధికారులు ముం దస్తు చర్యలతో వరద నీరు సాఫీగా నాలాల ద్వారా ప్రవహించింది. ఈ ఏడాది కూడా ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాకుండా  ఉండేందుకు నెల రోజులుగా పూడికతీత పనులు చేపడుతూ వస్తున్నారు. సర్కిల్‌లోని బాల్కాపూర్‌ నాలా, సోమాజిగూడలోని నాలాలను శుభ్రపరుస్తున్నారు. ఈ సం దర్భంగా వచ్చే వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నా రు. నిర్ణీత సమయంలోగా నాలాల పూడికతీత పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

50 శాతం పనుల పూర్తి

 ఖైరతాబాద్‌ రాజ్‌నగర్‌,ఆనంద్‌నగర్‌కాలనీ, చింతలబస్తీ మీదుగా ప్రవహించే బాల్కాపూర్‌నాలా,శ్రీనగర్‌కాలనీ, ఎ ల్లారెడ్డిగూడ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసు, సోమాజిగూడ మీదుగా ప్రవహించే నాలాలో పూడిక తీత పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. పనులు 50 శాతం పూర్తయ్యాయని వారం రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని అధికారులు తెలిపారు.

    ఎమ్మెల్యే ఆదేశాలతో నాలా పూడికతీత పనులు

 ఎర్రగడ్డ: ఎర్రగడ్డ డివిజన్‌ జనప్రియ మెట్రోపోలిస్‌ టౌన్‌షిప్‌ సమీపంలోని నాలా కొద్దిపాటి వర్షానికే పొంగుతూ లో తట్టు ప్రాంతాలను ముంచేస్తుంది. వర్షాకాలం సమీపించిన నేపథ్యంలో స్థానికులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన నాలా పూడికతీత పనులకు శ్రీకారం చుట్టాలని బల్దియా అధికారులకు చెప్పారు. ఈ మేరకు సిబ్బంది బుధవారం నాలాలో పూడికతీత పనులను మొదలు పెట్టారు. డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సంజీవ, వార్డు కమిటీ సభ్యుడు రాము, నేతలు రూపేశ్‌, రవిశంకర్‌ సిబ్బందికి సహకరించారు. 


logo