ఆదివారం 31 మే 2020
Hyderabad - May 23, 2020 , 02:39:33

నాలుగు లేన్లతో ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌

నాలుగు లేన్లతో ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌

సమాంతరంగా విస్తరణ పనులు

సమీక్షించిన ఉన్నతాధికారుల బృందం

అమీర్‌పేట్‌: ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌.. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో ఈ ఫ్లై ఓవర్‌ రద్దీగా ఉంటుంది. నగరంలోని బల్కంపేట్‌ నుంచి సనత్‌నగర్‌, బాలానగర్‌, జీడిమెట్ల పారిశ్రామికవాడలకు చేరుకోవడానికి ఇదే ఏకైక మార్గం. అం తటి ప్రాధాన్యత ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణం అనాలోచితంగా జరిగిందనే విమర్శలు తొలినాళ్ల నుంచి ఉన్నాయి. ఈ ఫ్లై ఓవర్‌ మీద రెండు భారీ వాహనాలు ఎదురెదురుగా రావాలంటే అంతటా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి.. ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటివరకు ఈ ఫ్లై ఓవర్‌ మీద లెక్కలేనన్ని ప్రమాదాలు, ఎన్నో మరణాలు, మరెంతోమంది క్షతగాత్రులుగా మిగిలిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. అంతటి ప్రమాదకర స్థాయిలో వన్‌ వే ప్రయాణాలకు ఏ మాత్రం అనుకూలించని పరిస్థితుల్లో ఉన్న ఈ ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా మరో ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టి నాలుగు లేన్లతో విస్తరించే పనులకు ప్రభుత్వం ఉపక్రమించింది.  

ఉన్నతాధికారుల బృందం పర్యటన...

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చొరవతో నాలుగు రోజుల కిందట పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, హెచ్‌ఆర్‌డీసీఎల్‌, రైల్వే, తదితర శాఖల అధికారులు ఈ ఫ్లై ఓవర్‌ పరిస్థితులను సమీక్షించారు.ఈ మా ర్గంలో ప్రస్తుతం ఉన్న ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా మరో ఫ్లై ఓవర్‌ను నిర్మించడమే మార్గమని తేల్చి చెప్పారు. ఆ మేరకు సిద్ధం చేసుకున్న ప్రతిపాదనలను అధికారుల బృందం పరిశీలించింది. ైప్లె ఓవర్‌ కింద నుంచి వెళ్తున్న రైల్వే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద పరిస్థితులను సమీక్షించారు. త్వరలో ఈ ఫ్లై ఓవర్‌ పనుల విస్తరణ కోసం స్థల సేకరణ చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.  

సర్వీస్‌ రోడ్డు విస్తరణతో మరింత మేలు...

 రెండున్నర దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంటూ వచ్చిన బల్కంపేట-సనత్‌నగర్‌ సర్వీస్‌ రోడ్డు వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు మంత్రి తీసుకున్న చర్యలతో స్థలాలను కోల్పోతున్న నాలుగు కుటుంబాలు గురువారం జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి పరిహారపు చెక్కులు అందుకున్నాయి. సాం కేతికంగా మిగిలిన ఇతర పనులు కూడా పూర్తిచేసి అసంపూర్తిగా మిగిలిన సర్వీస్‌రోడ్డు కూడా పూర్తిచేస్తే బల్కంపేట మీదుగా సనత్‌నగర్‌ చేరుకునే వాహనదారులు నేరుగా సర్వీ స్‌ రోడ్డు నుంచి వెళ్తారు. దీంతో వందలాది వాహనాలు  ఫ్లై ఓవర్‌ మీదకు చేరుకునే అవసరం ఉండదు.ఈ మార్గంపై వాహనాల ఒత్తిడిని గణనీయంగా తగ్గించే వీలుంది. 

మంత్రి తలసాని చొరవతో పనులు..

  ఫతేనగర్‌ ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా మరో రెండు లేన్ల నిర్మాణాలకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల అంతటా హర్షం వ్యక్తం అవుతున్నది. మంత్రి తలసాని కొద్ది నెలలు గా చెబుతూ వస్తున్న ఫ్లై ఓవర్‌ విస్తరణ అంశం ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చింది. పారిశ్రామికవాడలకు నిత్యం రాకపోకలు సాగించే భారీ వాహనాలతో పాటు సాధారణ వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా ఈ ఫ్లై ఓవర్‌ను తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.   - కోలన్‌ లక్ష్మీరెడ్డి, కార్పొరేటర్‌ సనత్‌నగర్‌ 


logo