ఆదివారం 31 మే 2020
Hyderabad - May 23, 2020 , 02:01:55

టీ-కన్సల్ట్‌ యాప్‌తో పోలీస్‌ సిబ్బందికి ఆన్‌లైన్‌లో వైద్యసేవలు

టీ-కన్సల్ట్‌ యాప్‌తో పోలీస్‌ సిబ్బందికి ఆన్‌లైన్‌లో వైద్యసేవలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇక రాచకొండ పోలీసులకు వైద్యసేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన టీ-కన్సల్ట్‌ యాప్‌ను శుక్రవారం రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాయంలో సీపీ మహేశ్‌భగవత్‌ ప్రారంభించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటీటీఏ)సహకారంతో హెల్త్‌ ఇన్‌ ఏ స్నాప్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ టెలీమెడిసిన్‌ యాప్‌ను దేశంలో మొదటిసారిగా సైబరాబాద్‌ పోలీసులు అందుబాటులోకి తేగా..రెండోది రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మహేశ్‌భగవత్‌ మాట్లాడుతూ  టీ-కన్సల్ట్‌ యాప్‌తో టెలీమెడిసిన్‌ సౌకర్యం తమ ముందుకు వచ్చిందన్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన వైద్యులకు సంబంధించిన స్లాట్స్‌ ఈ  యాప్‌లో అందుబాటులో ఉంటాయని, ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకొని సేవలు పొందాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో పోలీస్‌ అధికారులతోపాటు టీటీటీఏ విభాగం అధికారులు పాల్గొన్నారు.


logo