గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 17, 2020 , 01:58:00

ఆ అపార్ట్‌మెంట్‌లో మరో 10మందికి

ఆ అపార్ట్‌మెంట్‌లో మరో 10మందికి

అబిడ్స్‌/జియాగూడ: జియాగూడ ప్రాంతంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు వైద్య శాఖ అధికారులతో పాటు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జియాగూడ పరిధిలో 88 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రాగా, అందులో 9మంది మృతి చెందగా, 22 మంది గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జి కాగా మిగతావారు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జియాగూడ పరిధిలో  10  కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. ఈ జోన్లలో వైద్యశాఖ అధికారులు,ఆశవర్కర్లు ఇంటింటా సర్వే చేసి లక్షణాలు ఉన్న వారి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారిని క్వారంటైన్‌ చేస్తున్నారు. 

    మరికొంత మంది అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా టెస్ట్‌కు పంపిస్తున్నారు. జియాగూడ ప్రాంతంలో ఎప్పటికప్పుడు జాయింట్‌ కమిషనర్‌, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌,ఏసీపీ నరేందర్‌రెడ్డి,జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్యలు పర్యటించి కంటైన్‌మెంట్‌ జోన్లను తనిఖీ చేస్తున్నారు.

అంబర్‌పేట:గోల్నాక డివిజన్‌ అశోక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అతన్ని నేచర్‌ క్యూర్‌ దవాఖానకు తరలించి,కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తీసుకెళ్లారు.   

చందానగర్‌: చందానగర్‌ పరిధిలోని జవహర్‌ కాలనీకి చెందిన ఓ వృద్ధురాలి(80)కి కరోనా టెస్టు చేయడంతో పాజిటివ్‌ అని తేలింది.దీంతో ఆమెను గాంధీ దవాఖానకు తరలించారు. 

కూకట్‌పల్లి: మూసాపేట పరిధిలోని అవంతీనగర్‌ తోటలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతనితో పాటు కుటుంబసభ్యులను అధికారులు వైద్య పరీక్షల కోసం గాంధీ దవాఖానకు తరలించారు. 

అల్వాల్‌: అల్వాల్‌ శివనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతనితో  పాటు కుటుంబీకులను గాంధీకి తరలించారు. 

అబిడ్స్‌: జీహెచ్‌ఎంసీ అబిడ్స్‌ కార్యాలయం ఐదో అంతస్థులో ఓ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ జియాగూడలో నివసిస్తున్నాడు. కాగా ఆయన తల్లికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆ అంతస్థు  మొత్తాన్ని కంటైన్‌మెంట్‌ చేశారు.


logo