గురువారం 28 మే 2020
Hyderabad - May 17, 2020 , 01:57:53

ప్రాణదాతకు ప్రణామం..

ప్రాణదాతకు ప్రణామం..

బండ్లగూడ: రక్తదానం ప్రాణదానంతో సమానం.. నిండుప్రాణాన్ని కాపాడే సంజీవని. అంత విలువైన రక్తం అత్యవసర సమయాల్లో దొరక్కపోతే.. వచ్చే ఇబ్బందులు అంతా ఇంతా కావు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎవరికీ రావొద్దనే ఉద్దేశంతో హైదర్‌గూడకు చెందిన నవీన్‌.. ఆన్‌లైన్‌ బ్లడ్‌ డోనర్స్‌ ఇండియా పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ను రూపొందించారు. అవసరమైన వారికి రక్తాన్ని అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. 

ఒక్కరితో మొదలై... 

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌గూడ గ్రామానికి చెందిన కొంగళ్ల నవీన్‌ తన తల్లికి గొంతు క్యాన్సర్‌ చికిత్స కోసం అనేక ఆస్పత్రులు తిరిగారు. అదే సమయంలో అనేక మంది రక్తం అందక పడిన ఇబ్బందులను స్వయంగా చూశారు.  భవిష్యత్తులో ఇలా ఎవరూ ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో 2014లో ఆన్‌లైన్‌ బ్లడ్‌ డోనర్స్‌ ఇండియా పేరుతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను రూపొందించారు.  ఒకరితో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ఇప్పుడు 2500 మంది డోనర్స్‌తో కొనసాగుతున్నది. ఇప్పుడీ గ్రూప్‌ నగరంతో పాటు బెంగుళూరు, విజయవాడ, ఢిల్లీ తదితర రాష్ర్టాల వారికి ఉపయోగకరంగా మారింది. ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. 

త్వరలో యాప్‌...      

   రాష్ట్రంతో పాటు దేశంలో రక్తం కోసం ఒక యాప్‌ను రూపొందించాం. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా ఐవోఎస్‌ ద్వారా కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో రక్తం కొరతతో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడవద్దు. అవసరమైన వారికి రక్తం అందించడమే మా లక్ష్యం. 

-నవీన్‌,ఆన్‌లైన్‌ బ్లడ్‌ డోనర్స్‌ ఇండియా సంస్థ వ్యవస్థాపకుడు 


logo